లోఫర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లోఫర్. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి లోఫర్ అనే టైటిల్ పెట్టినప్పటికీ...రామ్ గోపాల్ వర్మ, సి.కళ్యాణ్ ఒత్తిడి మేరకు మా అమ్మ మహాలక్ష్మి అనే టైటిల్ పెట్టనున్నట్టు సమాచారం. రీసెంట్ గా కంచె సినిమాతో సక్సెస్ సాధించిన వరుణ్ తేజ్..లోఫర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం లోఫర్ సినిమా ఆడియోను నవంబర్ నెలాఖరున, సినిమాను డిసెంబర్ 18న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. క్లాస్ మూవీ కంచె తో సక్సెస్ సాధించిన వరుణ్ తేజ్..మాస్ మూవీ లోఫర్ తో ఏరేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com