సంఘమిత్ర గా లోఫర్ భామ ఫిక్సయ్యింది
Send us your feedback to audioarticles@vaarta.com
రూ.150 కోట్లకి పైగా బడ్జెట్‌తో ఓ చారిత్రాత్మక చిత్రాన్ని రూపొందించడానికి ప్రముఖ తమిళ దర్శకుడు, కుష్బూ భర్త సుందర్.సి సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సంఘమిత్ర పేరుతో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో మొదట శ్రుతి హాసన్ కథానాయికగా ఎంపికైంది. ఆ పాత్ర కోసమని గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం కూడా నేర్చుకున్న ఈ అమ్మడు.. అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చింది.
దీంతో సంఘమిత్ర చిత్ర బృందం మరో హీరోయిన్‌ని ఎంపిక చేసే పనిలో పడింది. ఆ తరువాత నయనతార, హన్సిక, అనుష్క వంటి పేర్లు పరిశీలనలోకి వచ్చినా.. దిశా పటాని టైటిల్ రోల్‌కి ఓకే చెప్పిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, ఈ రోజు కుష్బూ ఈ విషయాన్ని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసింది. పూరీ జగన్నాథ్ రూపొందించిన లోఫర్‌తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన దిశా.. బాలీవుడ్ బయోపిక్ ఎం.ఎస్.ధోనిలో ఓ హీరోయిన్‌గా సందడి చేసింది.
జయం రవి, ఆర్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రానికి డబుల్ ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com