బాలీవుడ్ వెళుతున్న లోఫర్...
Send us your feedback to audioarticles@vaarta.com
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా తెరకెక్కించిన చిత్రం లోఫర్. వరుణ్ తేజ్, దిషా పాట్ని జంటగా నటించిన లోఫర్ ఇటీవల రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా లోఫర్ టీమ్ సక్సెస్ టూర్ లో పాల్గొంటుంది. పూరి స్వస్థలం అయిన నర్సీపట్నంలో లోఫర్ టీమ్ విజయయాత్రలో ప్రేక్షకులను కలుసుకుంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...లోఫర్ మూవీని హిందీలో రీమేక్ చేయనున్నట్టు తెలిపారు. అలాగే కొత్త వాళ్లతో ఓ లవ్ స్టోరీ చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం పూరి రోగ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత లోఫర్ హిందీ రీమేక్ చేసే అవకాశం ఉంది. మరి...తెలుగులో ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయిన లోఫర్ హిందీలో రీమేక్ చేస్తే అక్కడ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments