'లోఫర్' సెన్సార్ పూర్తి..
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ హీరో వరుణ్‌తేజ్ కథానాయకుడిగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ సి.కళ్యాణ్ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్, తేజ నిర్మిస్తున్న భారీ చిత్రం 'లోఫర్'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 17న విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా
సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సి.కళ్యాణ్ మాట్లాడుతూ ''మా లోఫర్ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. మంచి కథ, కథనాలతో, చక్కని సెంటిమెంట్‌తో ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. ఇటీవల విడుదలైన ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సునీల్ కశ్యప్ చేసిన అద్భుతమైన ఆడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. సినిమా కూడా ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్ చేసేలా వుంటుంది. డిసెంబర్ 17న మా 'లోఫర్' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com