'ఎల్కేజీ' ట్రైలర్: లక్ష్మణ్ సెంచరీ కొడితే ఒకలా.. మత్స్యకారుడు చనిపోతే మరోలా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్జే బాలాజీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎల్కేజీ. బాలాజీ ప్రస్తుతం సెటైరికల్ మూవీస్ పై ఫోకస్ పెట్టాడు. గత ఏడాది నయనతార, బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించిన అమ్మోరు తల్లి చిత్రం ఓటిటిలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రంలో బాలాజీ దొంగ బాబాలపై సెటైర్స్ వేశాడు.
తాజాగా ఎల్కేజీ చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రం తమిళంలో 2019లోనే విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో బాలాజీ, ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్ర తెలుగు వర్షన్ ఆహా ఓటిటి లో జూన్ 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది.
ఈ మూవీలో బాలాజీ పొలిటికల్, మీడియా వ్యవస్థపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాపై ఆసక్తిని పెంచేలా ట్రైలర్ ఉంది. ' లక్ష్మణ్ సెంచరీ చేస్తే ఇండియన్ క్రికెటర్ లక్ష్మణ్ సెంచరీ అని మీడియాలో వేస్తారు. తెలుగు క్రికెటర్ అని రాయరు కదా. అదే ఒక మత్స్య కారుడు హత్యకు గురైతే తెలుగు మత్స్యకారుడు మృతి అని వేస్తారు ఎందుకు ? అని బాలాజీ మీడియాని ఈ చిత్రంలో నిలదీస్తున్నారు.
రాజకీయాలపై బాలాజీ వేస్తున్న సెటైర్లు మంచి ఫన్ జనరేట్ చేసే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న కొందరు పొలిటీషియన్స్ ని ప్రతిభింబించేలా ట్రైలర్ లో కొన్ని షాట్స్ ఉన్నాయి. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com