New Year Celebrations : మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్... ఇక కిక్కే కిక్కు

  • IndiaGlitz, [Thursday,December 29 2022]

మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. న్యూ ఇయర్ నిమిత్తం అంతా రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నారు. ముఖ్యంగా కుర్రకారు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోజున ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం సేవించి ఎంజాయ్ చేయాలనుకుంటారు. దీంతో ఇయర్ ఎండింగ్ రోజున మద్యం దుకాణాలు కిటకిటలాడుతూ వుంటాయి. న్యూఇయర్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకి శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అబ్కారీ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్లుండి రాత్రి ఒంటిగంట వరకు బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల్లో మద్యం విక్రయించేందుకు అనుమతించింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు , 2బీ లైసెన్స్ వున్న బార్‌లలో అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్ముకోవచ్చని తెలిపింది.

ఏం జరిగినా నిర్వాహకులదే బాధ్యత :

ఇదిలావుండగా.. ఎప్పటిలాగే కొత్త సంవత్సర వేడుకలంటే పోలీసులకు చేతినిండా పనే. అర్ధరాత్రి దాటాక ఘర్షణలు, రోడ్డు ప్రమాదాలు వంటి ఘటనలు మామూలే. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగానే మేల్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు ఈ సారి కఠిన నిబంధనలు విధించారు. పీకలదాకా తాగి రోడ్లపై హంగామా చేస్తే కటకటాల వెనక్కి నెడతామని హెచ్చరిస్తున్నారు. న్యూఇయర్ వేడుకల్ని నిర్వహించే నిర్వాహకులు కూడా పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు :

న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి పోలీసులు కొన్ని నిబంధనలు విడుదల చేశారు. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయరాదని, అలాగే యువతులు ధరించే దుస్తుల్లో అశ్లీలత కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. దీనితో పాటు వేడుకల్లో మాదక ద్రవ్యాలపై నిర్వాహకులు నిఘా వుంచాలని.. ఇలాంటి వెలుగులోకి వస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. అలాగే 45 డిసిబుల్స్ కంటే తక్కువ ధ్వని వచ్చే సౌండ్ సిస్టమ్ వినియోగించాలని, వేడుకలు నిర్వహించే చోట ఖచ్చితంగా సీసీ కెమెరాలు అమర్చాలని తెలిపారు. పరిమితికి మించి మద్యం సేవించిన వారిని దింపేందుకు క్యాబులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.

More News

Lucky Lakshman:‘లక్కీ లక్ష్మణ్’ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు : హీరో సోహైల్

బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టించి చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’.

KV Sridhar Reddy:కంటెంట్ మీదున్న నమ్మకంతోనే సినిమాను తీశాం - నిర్మాత శ్రీధర్ రెడ్డి

యంగ్ అండ్ లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం 'టాప్ గేర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు.

CM KCR: వియ్యంకుడు హరినాథరావు భౌతికకాయానికి కేసీఆర్ నివాళులు... కోడలిని ఓదార్చిన సీఎం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమా తండ్రి పాకాల హరినాథరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Chiranjeevi: సినీ కార్మికులకు అండగా నేనున్నాను - మెగాస్టార్ చిరంజీవి

చిత్రపురి కాలనీలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi),

Minister KTR : కేటీఆర్ సతీమణి శైలిమా తండ్రి హరినాథ రావు కన్నుమూత

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.