మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్డౌన్ ప్రకటన వచ్చిందో లేదో మందుబాబులు పెద్ద ఎత్తున వైన్ షాపులకు క్యూ కట్టారు. అయితే వీరికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పటి లాగానే మందు అమ్మకాలు జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్డౌన్ కాలంలో వైన్స్ షాపులను సైతం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అబ్కారీ శాఖకు ప్రాథమికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అబ్కారీ కార్యాలయాలు కూడా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఉంటాయని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
ప్రస్తుతం ఏపీలో కూడా ఉదయమే మద్యం దుకాణాలను తెరుస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా మద్యం దుకాణాలను తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే లాక్డౌన్లో నిత్యావసరాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం ఖరారు చేస్తోంది. పాలు, కూరగాయల దుకాణాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా ఉదయమే తెరిచి ఉంచుకోవాలని సూచించింది. ప్రస్తుతం మద్యం దుకాణాలను ఉదయం 10 గంటల తర్వాతే తెరుస్తుండగా… ఇప్పుడు ఉదయం 10 గంటల తర్వాత మూసివేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments