తెలంగాణలో అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు : కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలోని మందుబాబులకు సీఎం కేసీఆర్ తియ్యటి శుభవార్త చెప్పారు. రేపట్నుంచే అనగా బుధవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం షాపులను తెరుస్తున్నట్లు మీడియా ముఖంగా కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లతో పాటు రెడ్ జోన్లలో కూడా మద్యం షాపులకు తెరుచుకునేందుకు ఆయన అనుమతిచ్చారు. అయితే కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని ఈ సందర్భంగా.. ‘నో మాస్క్ నో లిక్కర్’ అనే స్లోగన్ను కేసీఆర్ చెప్పుకొచ్చారు. కంటైన్మెంట్ జోన్లలో 15 మంది షాపులున్నాయని అక్కడ మాత్రం తెరవరన్నారు. అయితే బార్లు, క్లబ్స్, పబ్స్ తెరవాడానికి మాత్రం అస్సలు చాన్సే లేదని సీఎం తేల్చిచెప్పారు. మద్యం ధరలు 16 శాతం పెంచుతున్నామని తెలిపారు. తక్కువ రేట్లు ఉన్న లిక్కర్ అనగా పేదలు తాగే మందుపై 11 శాతం.. మిగిలినవాటిపై అంటే పెద్దల తాగే లిక్కర్స్పై మాత్రం 16 మాత్రం పెంచుతున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఇతర రాష్ట్రాల్లో పెంచిన 70, 75 శాతంలపై ఇవాళ కేబినెట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని.. మాడరేట్గా మాత్రమే రాష్ట్రంలో పెంచుతున్నామని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా వైన్స్ అమ్మే, కొనే వారికి సీఎం కొన్ని హెచ్చరికలు జారీ చేశారు.
నో మాస్క్ నో లిక్కర్..
ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తెరుచుకుంటాయి. వైన్స్ షాపుల్లో మద్యం అమ్మే.. కొనేవారని హెచ్చరిస్తున్నా. కచ్చితంగా భౌతిక దూరం పాటించి తీరాల్సిందే. ఎక్కడైనా బౌతికదూరం పాటించకపోతే మాత్రం కచ్చితంగా ఆ షాపుకు సంబంధించి లైసెన్స్ గంటలోనే రద్దు చేసేస్తాం. షాపులు తెరిచే ఉంటాయ్.. ఎవరూ ఆగమాగమం కావాల్సిన అక్కర్లేదు. డేంజరస్ బీమారి కాబట్టి షాపు ఓనర్లు కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సిందే. నో మాస్క్ నో లిక్కర్ అనే స్లోగన్ తీసుకొస్తున్నాం. అలాగే నో మాస్క్ నో గూడ్స్.. అంటే కిరాణా షాపుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇందుకే తెరుస్తున్నాం..
‘తెలంగాణలోని కొందరు మందుబాబులు, బార్డర్ గ్రామాల ప్రజలు మన పక్కరాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్తో పాటు బార్డర్ రాష్ట్రాలకు వెళ్లి మందుకోసం క్యూ కడుతున్నారు. అలా వెళ్లడంతో కరోనా మహమ్మారి మరింత విస్తరించే అవకాశం ఉంది. మరోవైపు గుడుంబా కూడా పెద్దఎత్తున ప్రారంభమైంది. దీంతో డిస్టలరీస్ కంపెనీలు తెరవాలని డిమాండ్ చేస్తున్నాయి. అందుకే మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతిస్తున్నాను’ అని సీఎం తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com