ఏపీలో మందుబాబులకు మరో భారీ షాక్.. పెరిగిన ధరలు ఇవీ...
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో 3.0 లాక్డౌన్లో భాగంగా మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో కేంద్రం సడలింపులను ఏపీ ప్రభుత్వం కూడా అమలు చేసింది. మే-03 నుంచి మద్యం షాపులు తెరిచింది. అయితే ఇప్పటికే మద్యం నిషేధించాలని నిర్ణయించిన జగన్ సర్కార్ ఇందులో భాగంగా మొదట 25 శాతం మద్యం ధరలు పెంచింది. అయినప్పటికీ వైన్ షాపుల ముందు భారీగానే క్యూ ఉంది. ఎన్నో షాపుల ముందు గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఎక్కడికక్కడ చెదరగొట్టారు. ఇలా గుంపులు గుంపులుగా ఉండటం, ఎక్కువ మంది మద్యం కొంటుండటంతో ప్రభుత్వం తాజాగా మరోసారి భారీగా ధరలను పెంచేసింది. నిన్న 25 శాతం.. ఇవాళ ఏకంగా 50 శాతాన్ని పెంచేసింది. అంటే మొత్తం 75 శాతం ధరలను పెంచేసిందన్న మాట.
వంద శాతం చేసినా..!
వాస్తవానికి మిగిలిన రాష్ట్రాల్లో ఫస్ట్ టైమే భారీగానే ధరలు పెంచేశాయి. ఢిల్లీలో అయితే మొదటిసారే 70 శాతం రేట్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీ మాత్రం రెండుసార్లుగా పెంచి మొత్తం 75 శాతానికి చేసింది. ఒకటి రెండ్రోజుల తర్వాత అది కాస్త వందశాతానికి చేసినా చేయొచ్చు.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇవాళ అధికారులతో ఎక్సైజ్ కమిషనర్ నిశితంగా సమీక్ష నిర్వహించి పలు కీలక విషయాలు చర్చించారు. అనంతరం ఇలా ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఇవాళ పెంచిన ధరలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచే అమలు అయ్యాయి. ఇవన్నీ అటుంచితే ఈ నెలాఖరులోగా 15శాతం మద్యం దుకాణాలను మూసేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో మద్యం షాపులను ప్రభుత్వం మూతవేసేసిన విషయం విదితమే.
పెంచిన ధరలు ఇలా..
- క్వార్టర్ లిక్కర్ బాటిల్ 120రూపాయలు ఉండే రేంజ్ లో 90ఎంఎల్ కు 20 రూపాయలు, 180 ఎంఎల్‌కు 40 రూపాయలు, 375 ఎంఎల్ కు 80 రూపాయలు, 750 ఎంఎల్ కు 160 రూపాయలు 1000ఎంఎల్‌కు 240 రూపాయలు, 2000 ఎంఎల్‌కు 480 రూపాయలు పెంచుతూ నిర్ణయం
- క్వార్టర్ 120 నుంచి 150 రూపాయలు రకం లిక్కర్‌పై 90ఎంఎల్‌కు 40 రూపాయలు, 180 ఎంఎల్‌కు 80 రూపాయలు, 375 ఎంఎల్‌కు 160 రూపాయలు, 750 ఎంఎల్‌కు 320 రూపాయలు 1000ఎంఎల్‌కు 480 రూపాయలు, 2000ఎంఎల్‌కు 960 రూపాయలు పెంచుతూ నిర్ణయం.
- క్వార్టర్ 150రూపాయలు రేంజ్ ఉండే లిక్కర్‌పై 90ఎంఎల్‌కు 60 రూపాయలు, 180ఎంఎల్‌కు 120, 375ఎంఎల్‌కు 240, 750 ఎంఎల్‌కు 480, 1000ఎంఎల్‌కు 720, 2000ఎంఎల్‌కు 1440 రూపాయలు పెంచుతూ నిర్ణయం.
- ఇక బీరు విషయంలో 330 ఎంఎల్‌కు 40, 500నుంచి 650 ఎంఎంల్ మధ్య 60 రూపాయలు, 30,000ఎంఎల్ కు 4000రూపాయలు, 50,000ఎంఎల్‌కు 6000రూపాయలు పెంచుతూ నిర్ణయం.
- ఇక రెడీ టూ డ్రింక్ అన్ని రకాల మద్యంపై 205 నుంచి 275 ఎంఎల్ మధ్య 60 రూపాయలు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన ధరను అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌గా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఎక్సైజ్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ జారీ చేశారు. మొత్తానికి చూస్తే దశల వారీగా మద్యం నియంత్రించాలన్న వైఎస్ జగన్‌కు ఇది కూడా తోడ్పడుతుంది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం జే ట్యాక్స్ అంటూ హడావుడి చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com