Liquor Price:మందుబాబులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో మద్యం ధరలు తగ్గింపు, బాటిల్‌పై ఏంతంటే..?

  • IndiaGlitz, [Saturday,May 06 2023]

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మద్యంపై సర్కారు విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో బీర్ మినహా లిక్కర్‌ ధరలు తగ్గాయ. పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం వస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. దీనికి అడ్డుకట్ట వేసేందుకే లిక్కర్ ధరలు తగ్గించినట్లు తెలిపింది.

తక్షణం అమల్లోకి :

ప్రభుత్వ నిర్ణయంతో ఫుల్ బాటిల్‌పై 40, హాఫ్ బాటిల్‌పై రూ.20, క్వార్టర్ బాటిల్‌పై రూ.10 చొప్పున ధరలు తగ్గాయి. కొన్ని రకాల బ్రాండ్స్‌కు చెందిన ఫుల్ బాటిల్స్‌పై రూ.60 వరకు తగ్గించినట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ పేర్కొంది. అంతేకాదు.. తగ్గిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని తెలంగాణ బేవరేజస్ కార్పోరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గజ్జెల నాగేశ్. శనివారం నుంచి తయారయ్యే మద్యం బాటిళ్లపై తగ్గించిన కొత్త ధరలు ముద్రిస్తామని అధికారులు వెల్లడించారు.

గత నెలలో భారీగా బీర్ల అమ్మకాలు :

ఇదిలావుండగా.. ఎండలు ముదరడంతో తెలంగాణలో బీర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో రాష్ట్రంలో గత నెలలో రికార్డు స్థాయిలో బీర్ అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్ 1 నుంచి 17వ తేదీ వరకు ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 1.01 కోట్ల బీర్లు అమ్ముడుపోయినట్లు అబ్కారీ శాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి 8,46,175 కేసుల బీర్లను విక్రయించారు. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించింది.

More News

Adipurush:డార్లింగ్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్, ఏకంగా 70 దేశాల్లో స్పెషల్ స్క్రీనింగ్

భారతీయుల ఇతిహాసం రామాయణం ఆధారంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘‘ఆదిపురుష్’’.

Custody:'నిజం గెలవడానికి లేటవుతుంది.. కానీ ఖచ్చితంగా గెలుస్తుంది' : పవర్‌ఫుల్‌గా నాగ చైతన్య 'కస్టడీ' ట్రైలర్

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు అక్కినేని వారసుడు నాగచైతన్య.

Modi:అన్ని వైపులా విమర్శలు.. ఊహించని ఉపశమనం, ‘‘ ది కేరళ స్టోరీ’’కి ప్రధాని నరేంద్ర మోడీ మద్ధతు

ది కేరళ స్టోరీ చిత్రం ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కేరళకు చెందిన యువతుల మార్పిడి,

Chiranjeevi:చిరంజీవి పెద్ద మనసు, చదువుకున్న కాలేజ్ కోసం రూ.50 లక్షలు.. ఆలస్యంగా వెలుగులోకి

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగారు.

Manichandana:గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన సీనియర్ హీరోయిన్ మణిచందన.. ఎన్టీఆర్‌కి అత్త రోల్‌, ఇక దశ తిరిగినట్లేనా..?

80, 90 దశకాలలో వెండితెరను ఒక ఊపు ఊపిన నటీమణులు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు.