Liquor Price:మందుబాబులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో మద్యం ధరలు తగ్గింపు, బాటిల్‌పై ఏంతంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మద్యంపై సర్కారు విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో బీర్ మినహా లిక్కర్ ధరలు తగ్గాయ. పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం వస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. దీనికి అడ్డుకట్ట వేసేందుకే లిక్కర్ ధరలు తగ్గించినట్లు తెలిపింది.
తక్షణం అమల్లోకి :
ప్రభుత్వ నిర్ణయంతో ఫుల్ బాటిల్‌పై 40, హాఫ్ బాటిల్‌పై రూ.20, క్వార్టర్ బాటిల్‌పై రూ.10 చొప్పున ధరలు తగ్గాయి. కొన్ని రకాల బ్రాండ్స్‌కు చెందిన ఫుల్ బాటిల్స్‌పై రూ.60 వరకు తగ్గించినట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ పేర్కొంది. అంతేకాదు.. తగ్గిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని తెలంగాణ బేవరేజస్ కార్పోరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గజ్జెల నాగేశ్. శనివారం నుంచి తయారయ్యే మద్యం బాటిళ్లపై తగ్గించిన కొత్త ధరలు ముద్రిస్తామని అధికారులు వెల్లడించారు.
గత నెలలో భారీగా బీర్ల అమ్మకాలు :
ఇదిలావుండగా.. ఎండలు ముదరడంతో తెలంగాణలో బీర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో రాష్ట్రంలో గత నెలలో రికార్డు స్థాయిలో బీర్ అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్ 1 నుంచి 17వ తేదీ వరకు ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 1.01 కోట్ల బీర్లు అమ్ముడుపోయినట్లు అబ్కారీ శాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి 8,46,175 కేసుల బీర్లను విక్రయించారు. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout