మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. లిక్కర్ డోర్ డెలివరీ!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకు ఇంటికే పరిమితం అయ్యారు. అయితే.. మందుకు అలవాటుపడ్డ మందుబాబులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ఇబ్బందులను గుర్తించిన పలు రాష్ట్రాల ప్రభుత్వాలు వైన్ షాపులు తెరిచాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలవరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ తమ ఆదాయాన్ని ఇలా కూడా సంపాదించుకోవచ్చని ప్లాన్ వేసి.. మద్యం డోర్ డెలివరీ చేస్తామని ఆయా సంస్థలు స్పష్టం చేశాయి. ఈ మేరకు జార్ఖండ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రాష్ట్రంలోని రాంచీ, జంషెడ్పూర్, బొకారో లాంటి 9 పట్టణాల్లో మాత్రమే లిక్కర్‌ను ఇంటికే డెలివరీ చేసేందుకు స్విగ్గీ, జోమాటలతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇలా చేయాలి..
- కరోనా నేపధ్యంలో మద్యం షాపుల వద్ద సామాజిక దూరం పాటించాలి
- మాస్క్ కచ్చితంగా ధరించాల్సిందే.
- డెలివరీ బాయ్స్ ఎలప్పుడూ హ్యాండ్ శానిటైజర్ వాడాలి అని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శాలను విడుదల చేసింది.
మిగతా రాష్ట్రాల సంగతేంటి!
సో.. మొత్తానికి చూస్తే.. కరోనాతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను, అనుభవిస్తున్న భయాలను క్యాష్ చేసుకోవడానికి స్విగ్గీ, జొమాటో సిద్ధం అవుతున్నాయన్న మాట. అంటే ఇకపై ఆహారంతో పాటు ఆల్కహాల్‌ను కూడా అందజేయనున్నాయి. వైన్ షాపుల వద్ద పెద్ద ఎత్తున క్యూలు ఉండటం.. నిబంధనలను పట్టించుకోలేదని పోలీసుల లాఠీ ఛార్జీలు చేశారు. దీంతో ఆన్ లైన్ ద్వారా మద్యం అమ్మకాల చర్చకు రాగా.. ఈ క్రమంలో స్విగ్గీ, జొమోటాలు లిక్కర్ డెలివరీ ముందుకొచ్చాయి. అయితే ఇది దేశ వ్యాప్తంగా విస్తరిస్తుందా..? లేకుంటే రాంచీకి మాత్రమే పరిమితం అవుతాయో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments