Drug Container:వైజాగ్‌లో దొరికిన డ్రగ్స్ కంటైనర్‌తో టీడీపీ నేతలకు లింకులు..?

  • IndiaGlitz, [Friday,March 22 2024]

ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్‌ దొరకడం కలకలం రేపింది. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన ఓ కంటెనైర్‌లో డ్రగ్స్‌ ఉన్నాయని సీబీఐ అధికారులు గుర్తించారు. ఏకంగా 25 వేల కిలోలు డ్రగ్స్‌ చిక్కాయి. బ్రెజిల్‌లోని శాంటోస్‌ పోర్టు నుంచి వచ్చిన ఎస్‌ఈకేయూ 4375380 నెంబర్ ఉన్న కంటైనర్‌లో సరకు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ కంపెనీ పేరుతో వచ్చిన ట్రక్‌లో డ్రగ్స్‌ ఉన్నట్టు తేల్చారు. ఈ కంటైనర్‌లో 25 కిలోల చొప్పిన వె‌య్యి బ్యాగ్లు గుర్తించారు.

బ్యాగ్‌లు చెక్‌ చేస్తే నల్లమందు, మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంఫటేమిన్, మెస్కలిన్, మెథాక్వలోన్ వంటి డ్రగ్స్ ఉన్నట్టు తేల్చారు. దేశంలో అతి పెద్ద డ్రగ్స్‌ సరఫరాగా చెబుతున్నారు. దీని విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో యావత్ దేశమే షేక్ అవుతోంది. ఇంత భారీ డ్రగ్ మాఫియాతో తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధాలున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లా ఈదుమూడికి చెందిన సంద్యా ఆక్వా కంపెనీకి చెందినదిగా ఈ కంటైనర్‌ను గుర్తించారు. ఈ సంస్థ డైరెక్టర్లను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

ఈ డ్రగ్స్ స్కాంలో టీడీపీ నేతలకు నేరుగా లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీ కృష్ణ దేవరాయలు, రాయపాటి జీవన్‌లతో నిందితుడు కోటయ్య చౌదరికి దగ్గర సంబంధాలున్నాయని సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు యువనేత నారా లోకేష్‌కి దామచర్ల సత్య అత్యంత ఆప్తుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో లోకేష్, చంద్రబాబుకి కూడా నేరుగా సంబంధం ఉండే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. అందుకే ముందే ఉలిక్కిపడి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వరుసగా ట్వీట్లు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలోనే వైసీపీ కూడా టీడీపీ అంటే ఇన్నాళ్లు స్కాంలు చేస్తున్న తెలుగు దొంగల పార్టీ అనుకున్నాం..! కానీ.. తెలుగు డ్రగ్స్ పార్టీ అని వైజాగ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడగానే తేటతెల్లమైంది. ఇలా ఫొటోలతో సహా అడ్డంగా దొరికిపోయాక ఇంకేం బుకాయిస్తారు అని ట్వీట్ చేసింది. మొత్తానికి ఎన్నికల వేళ భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం.. నిందితులతో టీడీపీ నేతలకు లింకులు ఉన్నాయనే అనుమానాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

More News

TDP:టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Tamilisai:ఎంపీగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పోటీ ఎక్కడి నుంచంటే..?

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఎంపీగా పోటీ చేసే స్థానం ఖరారైంది. తాజాగా బీజేపీ విడుదల చేసిన మూడో జాబితాలో

Manchu Manoj:నా మాటలను తప్పుగా అపార్థం చేసుకున్నారు.. మంచు మనోజ్ క్లారిటీ..

తిరుపతిలో జరిగిన మోహన్ బాబు(Mohan Babu) జన్మదిన వేడుకల్లో మంచు మనోజ్(Manchu Manoj) చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Vikasit Bharat: కేంద్రానికి ఈసీ బిగ్ షాక్.. వికసిత్ భారత్ సందేశాలు ఆపాలని ఆదేశాలు..

కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న 'వికసిత్ భారత్' ప్రచారాన్ని వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేసింది.

Rakshit Atluri:‘శశివదనే’ మూవీ ‘పలాస’ కంటే చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను - హీరో రక్షిత్ అట్లూరి

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శశివదనే’.