రామ్ సినిమాకు చిక్కులు.. ఈసారి కంప్లైంట్ ఏంటంటే, మళ్ళీ దర్శకుడే..
Send us your feedback to audioarticles@vaarta.com
క్రేజీ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో నటించబోతుండడంతో హీరో రామ్ పోతినేని మంచి జోష్ లో ఉన్నాడు. కమర్షియల్ అంశాలతో చక్కటి మాస్ చిత్రం ఎలా తెరకెక్కించాలో లింగుస్వామికి బాగా తెలుసు. జూలై 12న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. రామ్ సరసన ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
ఇటీవల లింగుస్వామిపై తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనవద్ద అడ్వాన్స్ తీసుకుని తమ బ్యానర్ లో సినిమా చేయడం లేదని, డబ్బు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. ఆ వివాదం ఎలాగో ముగిసింది. తాజాగా లింగుస్వామిపై మరో వివాదం తెరపైకి వచ్చింది.
కథ కాపీ వివాదంలో మరో దర్శకుడు సీమాన్ లింగుస్వామిపై ఫిర్యాదు చేశారు. చాలా ఏళ్లుగా ఉన్న ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. 2013లో లింగుస్వామి ఓ కథతో హీరో సూర్యతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. కానీ ఆ కథ తనదే అని.. తాను రాసుకున్న 'పాగల్వాన్' కథతో పోలికలు ఉన్నాయని సీమ దర్శకుల అసోషషన్ లో ఫిర్యాదు చేశారు.
అయితే ఆ సమయంలో జోక్యం చేసుకున్న దర్శకుల అసోసియేషన్ సమస్యని పరిష్కరించింది. లింగుస్వామి మరో కథతో సూర్యతో అంజాన్ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ సీమాన్ మాత్రం పాగల్వన్ ని పట్టాలెక్కించలేదు. ఇప్పుడు లింగుస్వామి రామ్ తో సినిమాకు రెడీ అవుతుండగా సీమాన్ మళ్ళీ ఫిర్యాదు చేశారు.
అయితే ఇందులో వివాదం లేదని.. ఈ సమస్య గతంలోనే పరిష్కారం అయిందని లింగుస్వామి అంటున్నారు. ఈ కథని తమిళంలో తప్ప ఇతర భాషల్లో సినిమా తీసుకోవచ్చని అప్పుడే దర్శకుల అసోసియేషన్ తనకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు లింగుస్వామి అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments