లింగంపల్లి నుంచి వలస కార్మికులతో ఝార్ఖండ్‌కు తొలిరైలు!
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ వ్యాప్తంగా ఉన్న వలస కార్మికులను వారి స్వగృహాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ క్రమంలో తెలంగాణలోని లింగంపల్లి స్టేషన్ నుంచి ఝార్ఖండ్‌లోని హతియా స్టేషన్‌కి 1,230 మంది వలస కార్మికులతో 24 బోగీల ప్రత్యేక రైలు బయల్దేరినట్లు తెలుస్తోంది. వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో నిర్మాణ పనులు చేసేవారే. ఝార్ఖండ్ ప్రభుత్వం కోరగా.. కేసీఆర్ సర్కార్ ఈ రైలును ఏర్పాటు చేసింది. మార్చిలో లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తరువాత తొలి ప్రయాణికుల రైలు, ఈ ఉదయం బయల్దేరింది. ఝార్ఖండ్‌లోని హాతియాకు వెళ్లనుంది.
మొత్తం 24 బోగీల్లో ఒక్కో బోగీలో 72 బెర్త్‌లు ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరి మధ్యా సామాజిక దూరం ఉండేలా చూస్తూ, 54 మందిని చొప్పున మాత్రమే అనుమతించామని అధికారులు మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరిందని ట్వీట్ చేశారు. ఝార్ఖండ్ వచ్చిన వారిని స్వస్థలాలకు తరలిస్తామన్నారు. వారు ఇక్కడికి రాగానే కరోనా టెస్ట్‌లు చేసి ఆ తర్వాత క్వారంటైన్ పాటించాల్సిందేనన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments