డెలివరీ బాయ్స్‌కు లైన్ క్లియర్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో లాక్డౌన్ ప్రారంభమై నేటికి 12 రోజులవుతోంది. 10 రోజుల వరకూ చూసీచూడనట్టుగా వ్యవహరించిన పోలీసులు.. శనివారం నుంచి లాఠీకి పనిజెప్పారు. చివరకు స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి యాప్ బేస్డ్ కంపెనీల డెలివరీ బాయ్స్‌ను సైతం వదల్లేదు. వారిపై లాఠీ ఝుళిపించడమే కాదు.. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ భారీ చలానాలు విధించారు. వారి వాహనాలు సీజ్ చేశారు. ఈ పరిణామంతో డెలివరీ బాయ్లతోపాటు ఆయా కంపెనీలు సైతం షాక్‌కు గురయ్యాయి.
ఫుడ్ డెలివరీ బాయ్స్ వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో వారి వాహనాలను సీజ్ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. చాలా మంది కరోనా పేషెంట్స్‌తో పాటు వారి కుటుంబాలు సైతం ఎక్కువగా ఆన్లైన్ సేవలను పొందుతున్నాయి. ఇంటికి అవరసరమైన సరకులు, మెడిసిన్స్, ఆహారం అంతా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నారు. అలాగే బ్యాచ్లర్స్ కూడా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఇలా చాలామంది ఆన్లైన్ సేవలను పొందుతున్నారు. దీంతో వీరందరికీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దీనిపై డీజీపీ సానుకూల నిర్ణయం తీసుకున్నారు.
కనీసం ముందస్తు సమాచారం ఇచ్చినా ఇంటి గడప దాటేవాళ్లం కాదు కదా అని డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫారం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సలావుద్దీన్ రాష్ట్ర డీజీపీకి, హోంమంత్రికి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. యాప్ ఆధారిత సేవలను ఎలాంటి నోటీసులు, సమాచారం లేకుండా రోడ్లపై పోలీసులు నిలిపివేయడాన్ని ఆయన ఖండించారు. హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీ బాయ్స్ సమస్యకు లైన్ క్లియర్ అయ్యింది. జొమాటో, స్విగ్గీ డెలివరీ చేసే వారిని అడ్డుకోమని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments