డెలివరీ బాయ్స్‌కు లైన్ క్లియర్..

  • IndiaGlitz, [Sunday,May 23 2021]

తెలంగాణలో లాక్‌డౌన్ ప్రారంభమై నేటికి 12 రోజులవుతోంది. 10 రోజుల వరకూ చూసీచూడనట్టుగా వ్యవహరించిన పోలీసులు.. శనివారం నుంచి లాఠీకి పనిజెప్పారు. చివరకు స్విగ్గీ, జొమాటో, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి యాప్‌ బేస్డ్‌ కంపెనీల డెలివరీ బాయ్స్‌ను సైతం వదల్లేదు. వారిపై లాఠీ ఝుళిపించడమే కాదు.. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ భారీ చలానాలు విధించారు. వారి వాహనాలు సీజ్‌ చేశారు. ఈ పరిణామంతో డెలివరీ బాయ్‌లతోపాటు ఆయా కంపెనీలు సైతం షాక్‌కు గురయ్యాయి.

ఫుడ్ డెలివరీ బాయ్స్ వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో వారి వాహనాలను సీజ్ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. చాలా మంది కరోనా పేషెంట్స్‌తో పాటు వారి కుటుంబాలు సైతం ఎక్కువగా ఆన్‌లైన్ సేవలను పొందుతున్నాయి. ఇంటికి అవరసరమైన సరకులు, మెడిసిన్స్, ఆహారం అంతా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నారు. అలాగే బ్యాచ్‌లర్స్ కూడా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఇలా చాలామంది ఆన్‌లైన్ సేవలను పొందుతున్నారు. దీంతో వీరందరికీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దీనిపై డీజీపీ సానుకూల నిర్ణయం తీసుకున్నారు.

కనీసం ముందస్తు సమాచారం ఇచ్చినా ఇంటి గడప దాటేవాళ్లం కాదు కదా అని డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫారం వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు సలావుద్దీన్‌ రాష్ట్ర డీజీపీకి, హోంమంత్రికి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. యాప్‌ ఆధారిత సేవలను ఎలాంటి నోటీసులు, సమాచారం లేకుండా రోడ్లపై పోలీసులు నిలిపివేయడాన్ని ఆయన ఖండించారు. హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీ బాయ్స్ సమస్యకు లైన్ క్లియర్ అయ్యింది. జొమాటో, స్విగ్గీ డెలివరీ చేసే వారిని అడ్డుకోమని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

More News

మందు తయారీలో హానికర పదార్థాలు లేవు: ఆయూష్ కమిషనర్

ఆనందయ్య ఆయుర్వేద ఔషధంపై ఏపీ ఆయుష్ కమిషన్ పరిశీలన ముగిసింది. ఆనందయ్య ఎలాంటి హానికర పదాదార్థాలను వాడటం లేదని ఏపీ ఆయూష్ కమిషనర్ రాములు వెల్లడించారు.

స్టార్ మా డాన్స్ ప్లస్ విజేత ఎవరో తెలుసా ?

స్టార్ మా లో ఈ శనివారం రాత్రి 9 గంటలకు, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి "డాన్స్ ప్లస్" సంగ్రామం గ్రాండ్ ఫైనల్స్ అద్భుతంగా అలరించబోతున్నాయి.

పోలీసులకు ఫిర్యాదు చేసిన సింగర్ మధుప్రియ.. ఏం జరిగిందంటే ?

తెలుగులో టాలెంట్ ఉన్న యంగ్ సింగర్స్ లో మధుప్రియ ఒకరు. మధుప్రియ తరచుగా వార్తల్లో నిలుస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఆమె వ్యక్తిగత విషయాలు కూడా గతంలో వార్తల్లో కెక్కాయి.

బైడెన్, ఫౌచీ వస్తున్నారు.. ఆనందయ్యపై ఆర్జీవీ సెటైర్లు

నెల్లూరు జిల్లా కృష్ణ పట్నంలో కరోనా రోగులకు ఆనందయ్య అనే నాటు వైద్యుడు చేస్తున్న వైద్యం దేశం మొత్తం సంచలనంగా మారింది. ఆనందయ్య

మా నాన్నగారికి ఆయనే అడ్వైజర్.. బీఏ రాజు మృతి పట్ల ప్రముఖ నిర్మాత

ప్రముఖ పీఆర్వో, జర్నలిస్ట్, నిర్మాత బీఏ రాజు అకాల మరణంతో టాలీవుడ్ మొత్తం విషాదంలో మునిగిపోయింది. శుక్రవారం అర్థరాత్రి ఆయన గుండెపోటుతో మరణించారు.