శాంతించిన ఓపీఎస్.. ఈపీఎస్‌కు లైన్ క్లియర్..
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొద్ది రోజులుగా హాట్ హాట్‌గా నడుస్తున్న తమిళ రాజకీయాల్లో ఎట్టకేలకు ప్రశాంతత నెలకొంది. సీఎం అభ్యర్థి నిర్ణయంపై అన్నాడీఎంకేలో చెలరేగిన వివాదం సీనియర్ మంత్రులు, పార్టీ నేతల రాజీ యత్నాలతో రాజీ యత్నాలతో సమసిపోయింది. పార్టీ ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి, సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం మధ్య తలెత్తిన విభేదాలు సద్దుమణిగాయి. సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించాలంటే.. తనను ప్రకటించాలంటూ నిన్న మొన్నటి వరకూ ఈపీఎస్, ఓపీఎస్లు పట్టుబట్టిన విషయం తెలిసిందే. పార్టీ నేతల రాజీ యత్నాలతో పన్నీర్ సెల్వం శాంతించడంతో పళని స్వామికి లైన్ క్లియర్ అయింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని బుధవారం అధికారికంగా ప్రకటించనున్నారు.
గత నెల 28న అన్నాడీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో వివాదం చెలరేగింది. పార్టీ ముఖ్య నేతలైన పళనిస్వామి, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం వాగ్వాదానికి దిగడంతో పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు అవాక్కయ్యారు. అప్పటి నుంచి పన్నీర్ సెల్వం కాస్త పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో పార్టీ నేతలు రంగ ప్రవేశం చేసి.. పన్నీర్ సెల్వంతో పలు విడతలుగా చర్చలు జరిపి ఆయనను శాంతింపజేసేందుకు యత్నించారు. అనంతరం పన్నీర్ సెల్వం తన స్వస్థలమైన పెరియకులంలోని కైలాసపట్టి ఫామ్‌హౌస్‌లో తన మద్దతుదారులతో పలు విడతలుగా మంతనాలు జరిపారు. అనంతరం గత ఆదివారం చెన్నైకు తిరిగి వచ్చారు.
చెన్నైకు రాగానే పార్టీ సీనియర్లతో పన్నీర్ సెల్వం చర్చలు జరిపారు. పార్టీ భవిష్యత్ కోసం సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో పట్టు సడలించాలని పన్నీర్ సెల్వంను పార్టీ నేతలు కోరారు. దీనికి ప్రతిగా పన్నీర్‌సెల్వం కోరుతున్నట్లు 11 మందితో మార్గదర్శక కమిటీని ఏర్పాటు చేయిస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు. బుధవారం సీఎం అభ్యర్థిని ప్రకటించిన సమయంలోనే మార్గదర్శక కమిటీ ఏర్పాటు గురించి కూడా ప్రకటన చేయాలని పన్నీర్‌సెల్వం డిమాండ్ చేశారు. అందుకు పార్టీ నేతలు అంగీకరించడంతో పన్నీర్ సెల్వం దిగి వచ్చారు. మార్గదర్శక కమిటీలో ఎడప్పాడి వర్గానికి చెందిన ఐదుగురు, పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన ఐదుగురు సభ్యులుగా ఉంటారు. ఏ వర్గానికి చెందని తటస్థంగా ఉండే సీనియర్ నాయకుడిని మరో సభ్యుడిగా నియమించనున్నారు. దీంతో అన్ని అడ్డంకులు తొలిగిపోయి నేడు పార్టీ సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని.. మార్గదర్శక కమిటీని నేడు అధికారికంగా ప్రకటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com