నాటి 'శ్రీనివాస కళ్యాణం' బాటలోనే..
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ కెరీర్లో మరపురాని చిత్రాలలో శ్రీనివాస కళ్యాణం` (1987) ఒకటి. భానుప్రియ, గౌతమి కథానాయికలుగా నటించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టొరీ .. వరుస పరాజయాల్లో ఉన్న వెంకటేష్‌కు మంచి విజయాన్ని అందించింది. యువచిత్ర ఆర్ట్స్ పతాకంపై కె.మురారి నిర్మించిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా కథ, కథనంతో పాటు పాటలు కూడా అలరించాయి. ముఖ్యంగా “సరోజ”గా గౌతమి నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇదిలా వుంటే... ఇప్పుడు ఇదే పేరుతో దిల్ రాజు నిర్మాణంలో నితిన్ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కూడా పాత చిత్రం మాదిరిగానే ఇద్దరు కథానాయికలకు చోటు ఉండగా.. ఆ పాత్రల్లో రాశి ఖన్నా, నందిత శ్వేత నటిస్తున్నారు. శతమానం భవతి` వంటి కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించిన సతీష్ వేగేశ్న ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి ఇద్దరు హీరోయిన్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. పాత చిత్రం మాదిరిగానే వెండితెరపై మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com