Like Share and Subscribe: 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్' ఫస్ట్ లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
వినోదంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలు రూపొందిస్తూ, విలక్షణమైన కథాంశాలని ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. తన సినిమాలన్నింటిలో వినోదం ప్రధానంగా ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం ఆయన కొన్ని సూపర్‌హిట్‌లను సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్‌తో ఒక సినిమా చేస్తున్నారు. సంతోష్ కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్' ఏక్ మినీ కథ' కు మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్ ప్లే అందించినందున వారి క్రేజీ కలయికలో వస్తున్న రెండో చిత్రమిది.
యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌లో సంతోష్ శోభన్ జోడిగా జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ 'శ్యామ్ సింగరాయ్' ని అందించిన వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
తాజాగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు, ఈ సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి లైక్ షేర్ చే సబ్‌స్క్రైబ్ అనే క్రేజీ టైటిల్ పెట్టారు. ఇవి యూట్యూబ్ లో వీడియో కంటెంట్‌ను ప్రచారం చేయడానికి ఉపయోగించే సాధారణ పదాలు. ప్రతి పదాన్ని సూచించే చిహ్నాలతో టైటిల్ లోగో చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది.
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్ అడవిలో, టాప్ యాంగిల్‌లో విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ చూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తుంటే సినిమా కథ చాలా విలక్షణంగా ఉండబోతోందని అర్ధమౌతోంది.
ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments