'లైఫ్ స్టైల్ ' ఫస్ట్ లుక్ లాంచ్
Send us your feedback to audioarticles@vaarta.com
కలకొండ ఫిలింస్ లైఫ్ స్టైల్ చిత్ర ఫస్ట్ లుక్ కార్యక్రమం ఘనంగా జరిగింది. డాక్టర్ వకుళాభరణం మోహనకృష్ణ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు. అలాగే చిత్ర యూనిట్ సభ్యులు ఫస్ట్ లుక్ లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ.. దర్శకుడు సతీష్ సందేశంతో కూడిన కథతో ఈ సినిమాను తీశారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలు ఆధారంగా ఈ సినిమా తీయ్యడం జరిగింది. నిర్మాత నరసింహ ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకోవాలి. నూతన నటీనటులు కలసి చేసిన ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్న అన్నారు
నిర్మాత కలకొండ నర్సింహ మాట్లాడుతూ... కొన్ని సంవత్సరాల క్రితం 2g నెట్ వర్క్ ఉండేది. అప్పుడు మనుషులు చాలా పద్దతిగా ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం 4g నెట్ వర్క్ అప్డేట్ అయ్యిందిమ్ మనుషులు కూడా 4g నెట్ కోసం 4g మొబైల్ ఇష్టంగా తీసుకొని 4g కి, 4g మొబైల్ కి అంకితం అవుతున్నారు. చిన్న పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరుకు 4g కి అలవాటుపడి చదువులు ఉద్యోగాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లుతండ్రులను, బంధువులను కూడా పట్టించుకోవడం లేదు.
దర్శకుడు సి.ఎల్.సతీష్ మార్క్ మాట్లాడుతూ... 4g నెట్ ను అలవాటు పడి యువత బ్యాడ్ హ్యాబిట్స్ కు అలవాటు పడుతున్నారు. 4g మొబైల్ కు 4g నెట్వర్క్ ఎంత అవసరమో మనం కూడా మన ఫ్యామిలి కి అంతే అవసరం. ఈ విషయాలు సినిమాలో చెప్పడం జరిగింది. అందరిని ఆలోచింపజేసే సినిమా ఇది. తప్పకుండా అందరికి మా లైఫ్ స్టైల్ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు.
నటీనటులు: నెహ్రు విజయ్ రోజా నిఖిల్ సంతోషి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com