Leo:'లియో' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

  • IndiaGlitz, [Monday,November 20 2023]

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'లియో' సినిమా దసరా కానుకగా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.600కోట్ల వసూళ్లు రాబట్టింది. తెలుగులో కూడా దాదాపు రూ.30 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సినిమా విడుదలై నెల రోజులు కావడంతో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అభిమానులు ఎదురుచూస్తు ఉన్నారు. అలాంటి అభిమానులకు శుభవార్త లాంటి వార్త బయటకు వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix)లో నవంబర్ 24 నుంచి భారత్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కేవలం ఇండియాలో మాత్రమే స్ట్రీమింగ్ కానున్నట్లు సంస్థ ప్రకటించింది. మిగతా దేశాల్లో నవంబర్ 28 నుంచి అందుబాటులో ఉండనుందని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో థియేటర్లలో చూడని వారు ఈ సినిమాను ఓటీటీలో చూసేయడానికి రెడీ అయిపోయారు.

ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా, సంజయ్ దత్ విలన్‌గా, గౌతమ్ మీనన్, అర్జున్, మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ఇక అనిరుథ్ అందించిన సంగీతం మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంది. చివర్లో ఈ సినిమా కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీ (LCU)లో భాగమే అని రిలీవ్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంతో చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి అయి షూటింగ్ కూడా ప్రారంభమైంది. వచ్చే ఏడాది వేసవిలో మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

More News

Fire Accident: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

Bigg Boss Telugu 7 : ఈ వారం నో ఎలిమినేషన్ .. నెక్ట్స్ వీక్ ఇద్దరు ఇంటికే , మరిన్ని ట్విస్టులు ఖాయం

బిగ్‌బాస్ 7 తెలుగు ఉల్టా పల్టా సీజన్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ముందుకు సాగుతోంది.

Calling Sahasra:సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర’.. డిసెంబర్ 1న రిలీజ్

బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు

Bigg Boss Telugu 7 : శివాజీ బూతులు.. ఇంట్లో ఆ పదాలు బ్యాన్ చేసిన నాగ్ , ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చేసిన యావర్

బిగ్‌బాస్ 7 తెలుగులో 11 వారాలు గడిచిపోయాయి. మరికొద్దిరోజుల్లో షో ముగియనుంది. చివరి వరకు వచ్చేసరికి షో ఉత్కంఠగా మారుతోంది.

Chinthamaneni:తగ్గని చింతమనేని బలుపు.. గొర్రెల కాపరిపై దాడి..

ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అహంకారంతో అనేక అరాచకాలు చేశారు.