Leo:'లియో' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'లియో' సినిమా దసరా కానుకగా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.600కోట్ల వసూళ్లు రాబట్టింది. తెలుగులో కూడా దాదాపు రూ.30 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సినిమా విడుదలై నెల రోజులు కావడంతో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అభిమానులు ఎదురుచూస్తు ఉన్నారు. అలాంటి అభిమానులకు శుభవార్త లాంటి వార్త బయటకు వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix)లో నవంబర్ 24 నుంచి భారత్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కేవలం ఇండియాలో మాత్రమే స్ట్రీమింగ్ కానున్నట్లు సంస్థ ప్రకటించింది. మిగతా దేశాల్లో నవంబర్ 28 నుంచి అందుబాటులో ఉండనుందని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో థియేటర్లలో చూడని వారు ఈ సినిమాను ఓటీటీలో చూసేయడానికి రెడీ అయిపోయారు.
ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా, సంజయ్ దత్ విలన్‌గా, గౌతమ్ మీనన్, అర్జున్, మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ఇక అనిరుథ్ అందించిన సంగీతం మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. చివర్లో ఈ సినిమా కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీ (LCU)లో భాగమే అని రిలీవ్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంతో చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి అయి షూటింగ్ కూడా ప్రారంభమైంది. వచ్చే ఏడాది వేసవిలో మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com