హైదరాబాద్‌లో ‘లియో 9 వీఎఫ్‌ఎక్స్‌’ స్టూడియో ప్రారంభం

  • IndiaGlitz, [Monday,September 09 2019]

విశాఖలో ఐదేళ్లుగా తక్కువ ఖర్చులో నాణ్యమైన వీఎఫ్‌ఎక్స్‌, ఎడిటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ సేవలు అందిస్తూ... అందరి అభిమానం చూరగొన్న ‘లియో 9 వీఎఫ్‌ఎక్స్‌’ స్టూడియో హైదరాబాద్‌లో బ్రాంచ్‌ ఓపెన్‌ చేసింది. ప్రముఖ నటులు, మెగా బ్రదర్‌ నాగబాబుగారు ఈ స్టూడియో బ్రోచర్‌, టీజర్‌ సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
 
అనంతరం మెగా బ్రదర్‌ నాగబాబు మాట్లాడుతూ ‘‘సునీల్‌ చరణ్‌కి, జయవాణిగారికి ఆల్‌ ది బెస్ట్‌. నేను కొన్ని విషయాల్లో క్లారిటీగా ఉంటాను. మెగా ఫ్యామిలీని అభిమానించే వాళ్లను ఎంకరేజ్‌ చేస్తాను. సపోర్ట్‌ చేస్తాను. సునీల్‌ చరణ్‌ మెగా అభిమాని. అన్నయ్య అంటే అతడికి ఎంతో ఇష్టం. చాలామంది చిరంజీవిగారిని చూసి యాక్టర్‌ అవ్వాలనుకుంటారు. సునీల్‌ చరణ్‌ కూడా యాక్టర్‌ అయ్యాడు. కొంతమంది యాక్టర్‌ అయిన తర్వాత వర్కవుట్‌ కాకపోతే తమలోని హిడెన్‌ టాలెంట్స్‌ను గుర్తించరు. కానీ, సునీల్‌ చరణ్‌ తనలో టెక్నీషియన్‌ని గుర్తించి ఇటు షిఫ్ట్‌ అయ్యాడు. క్లయింట్స్‌ మన దగ్గరకు రాకుండా... క్లయింట్స్‌ దగ్గరకు మనమే వెళ్లాలని హైదరాబాద్‌లో లియో 9 వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియో బ్రాంచ్‌ ఏర్పాటు చేయడం మంచి విషయం. వ్యాపార లక్షణం. హైదరాబాద్‌లో సినిమా, టీవీ, పలు వ్యాపార రంగాలున్నాయి. ప్రతి ఒక్కరికీ యాడ్స్‌ కావాలి. వాటికి స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ అవసరం. ప్రపంచవ్యాప్తంగా స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ చేయడానికి సరిపడా నిపుణులు లేరు. ఈ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. సునీల్‌ చరణ్‌ మంచి స్థాయికి రావాలనని కోరుకుంటున్నా. వ్యాపారంలో ఒక్కోసారి స్థబ్దత ఏర్పడవచ్చు. అలాగని, డిజప్పాయింట్‌ కాకూడదు. చివరి వరకూ నిలబడితే 100% సక్సెస్‌ అవుతారు. అమితాబ్‌ బచ్చన్‌ వ్యాపారాలు చేసి నష్టపోయి, మళ్లీ సూపర్‌స్టార్‌గా ఏదిగారు. రణ్‌వీర్‌ సింగ్‌, విజయ్‌ దేవరకొండ, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ ఎటువంటి నేపథ్యం లేకుండా వచ్చి సక్సెస్‌ అయ్యారు. ఇండస్ట్రీలో పైకి రావడానికి గాడ్‌ ఫాదర్‌ ఎవరూ అవసరం లేదు. చిరంజీవిగారు కూడా ఏ గాడ్‌ ఫాదర్‌ లేకుండా పైకి వచ్చారు. మన కష్టం, ప్రతిభ, అంకితభావంపైన మన విజయాలు ఆధారపడి ఉంటాయి. సునీల్‌ చరణ్‌ తన కష్టం, ప్రతిభతో పైకి రావాలి. స్పెషల్‌ ఎఫెక్ట్స్‌కి ఎండ్‌ లేదు. ఫారిన్‌లో వీఎఫ్‌ఎక్స్‌ చేయిస్తే ఎక్కువ ఖర్చు కనుక వాళ్లు మన దగ్గరకు వస్తున్నారు’’ అన్నారు.
 
జయవాణి మాట్లాడుతూ ‘‘సునీల్‌ చరణ్‌కు వైజాగ్‌లో వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియో ఉంది. అక్కడికి వెళ్లినప్పుడు అతడిలో టాలెంట్‌ చూశాను. నేను అందరికీ ఆర్టిస్టుగా తెలుసు. కానీ, నిర్మాతల కష్టాన్ని కొన్నిసార్లు కళ్లారా చూశాను. చిన్న చిన్న వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌కు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. తక్కువ ఖర్చులో మా నిర్మాతలకు మంచి క్వాలిటీ అవుట్‌పుట్‌ ఇవ్వడానికి మేం ఈ స్టూడియో పెట్టడం జరిగింది. ఎటువంటి కెమెరాతో తీసినా... మంచి క్వాలిటీగా సినిమా వచ్చేలా కృషి చేస్తున్నాం. వీఎఫ్‌ఎక్స్‌, ఎడిటింగ్‌ వర్క్స్‌తో పాటు డీఐ చేసిన తర్వాత కూడా సినిమా క్వాలిటీ పెంచే టెక్నిక్‌ మా స్టూడియో స్పెషాలిటీ’’ అన్నారు.
 
సునీల్‌ చరణ్‌ మాట్లాడుతూ ‘‘నేను మెగా అభిమానిని. చిరంజీవిగారు అంటే పిచ్చి. సినిమాల్లో టెక్నికల్‌గా ఏదైనా చేయాలని పిక్సలాయిడ్‌లో వీఎఫ్‌ఎక్స్‌ ఆర్టిస్ట్‌గా చేరాను. నా అదృష్టం ఏంటంటే... అక్కడ మెగా సినిమాలకు పని చేసే అవకాశం లభించింది. ‘అత్తారింటికి దారేది’, ‘ఎవడు’, ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రాలకు పని చేశా. ఐదేళ్ల కిత్రం వైజాగ్‌లో ‘లియో 9 వీఎఫ్‌ఎక్స్‌’ స్టూడియో ప్రారంభించాం. అమెరికా నుండి క్లయింట్స్‌ మా దగ్గరకు వస్తున్నారు. హైదరాబాద్‌ నుండీ వస్తున్నారు. జయవాణిగారు మా వర్క్‌ చూసి, హైదరాబాద్‌ రావడానికి మాకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. ఏ కెమెరాతో షూటింగ్‌ చేసినా... మా స్టూడియోకి వస్తే, బెస్ట్‌ క్వాలిటీ ఇస్తాం. మా స్టూడియోలో వర్క్‌ చేశాక చూస్తే... పెద్ద సినిమాలా ఉంటుంది. క్లయింట్స్‌కి టైమ్‌కి క్వాలిటీ వర్క్‌ ఇవ్వడమే మా లక్ష్యం’’ అన్నారు.
 
రఘుబాబు మాట్లాడుతూ ‘‘లేడీ ఆర్టిస్టుగా జయవాణి తెలుసు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా మంచి పాత్రలు చేయాలి. సునీల్‌ చరణ్‌ కొన్ని సినిమాలు చేశాడు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్న ఈ కంపెనీ సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా. ‘బాహుబలి’ తర్వాత వీఎఫ్‌ఎక్స్‌కి ఇంపార్టెన్స్‌ పెరిగింది. భవిష్యత్తులో వీఎఫ్‌ఎక్స్‌ నేపథ్యంలో మరిన్ని చిత్రాలు వస్తాయి’’ అన్నారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీమతి గంపా సిద్ధలక్ష్మి, ‘జబర్దస్త్‌’ నటులు చమ్మక్‌ చంద్ర, అప్పారావుతో పాటు పి. రాము తదితరులు పాల్గొన్నారు.

More News

స‌రిలేరు అంటూ మ‌హేశ్‌తో జ‌త క‌ట్ట‌నున్న మిల్కీ బ్యూటీ

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 26వ చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌,

తిరుప‌తిలో పెళ్లి చేసుకుంటాన‌న్న జాన్వీ

దివంగ‌త తార శ్రీదేవి దూర‌మైంద‌న్న బాధ‌లో ఉన్న అభిమానులు ఆమెను జాన్వీక‌పూర్‌లో చూసుకుంటున్నారు.

నిజ‌మైన మెగాస్టార్‌ను చూశానంటున్ను చెర్రీ

మెగాస్టార్ చిరంజీవితో ఎవ‌రికైనా సినిమా చేయాల‌నుంటుంది. అది ద‌ర్శ‌కుడైనా కావ‌చ్చు.. నిర్మాతైనా కావ‌చ్చు.

అక్టోబర్‌లో సెట్స్‌పైకి రాజశేఖర్‌ కొత్త సినిమా

యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ కథానాయకుడిగా క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ పతాకంపై జి. ధనుంజయన్‌ ఓ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే.

వాల్మీకి ట్రైలర్ రిలీజ్

నాపైన పందాలేస్తే గెలుస్తరు.. నాతోటి పందాలేస్తే సస్తరు..', 'మనం బతుకుతున్నమని పదిమందికి తెల్వకపోతే.. ఇగ బతుకుడెందుకురా..'