Waltair Veerayya : వాల్తేరు వీరయ్య’ కోసం లెజెండరీ సింగర్.. పదిహేనేళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ సినిమాలో
Send us your feedback to audioarticles@vaarta.com
ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Megastar)నటించిన చిత్రం ‘‘వాల్తేర్ వీరయ్య’’. చిరు వీరాభిమాని బాబీ (Bobby) (కేఎస్ రవీంద్ర) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతి హాసన్ (Shruti Hasaan) నటిస్తున్నారు. అలాగే మాస్ మహారాజా రవితేజ ఓ పవర్ ఫుల్ పాత్రలో తళుక్కున మెరవనున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రవితేజ ఫస్ట్ లుక్, టీజర్‌తో మెగా అభిమానులు పూనకంతో ఊగిపోయారు. చిరంజీవి (Chiranjeevi)- రవితేజ (Ravi Teja) మధ్య వచ్చే సీన్స్ ఓ రేంజ్‌లో వుంటాయనే ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
నువ్వు శ్రీదేవైతే అనే పాటను లీక్ చేసిన చిరు:
ఇదిలావుండగా.. వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)సినిమాలోని లిరికల్ సాంగ్‌ను మెగాస్టార్ చిరంజీవి లీక్ చేసేశారు. ‘‘ నువ్వు శ్రీదేవివైతే.. నేను చిరంజీవినవుతా ’’ అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా పాట చిత్రీకరణ కోసం తాము ఫ్రాన్స్‌లో వున్నామని... మైనస్ 8 డిగ్రీల చలిలో డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టంగా వుందని , కానీ అభిమానుల కోసం ఇష్టపడి చేశానని చిరు తెలిపారు.
ఆ పాట పడింది రాక్‌స్టార్ కాదు :
ఇకపోతే.. చిరు లీక్ చేసిన పాటను రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పాడారని అంతా అనుకున్నారు. కానీ అది నిజం కాదట. దీనిని బాలీవుడ్ లెజెండరీ సింగర్ అద్నాన్ సమీ ఆలపించారట. ప్రస్తుతం హిందీ చిత్రాలకే పరిమితమైన ఆయన చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్ సినిమా కోసం పనిచేశారు. అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం కార్తీకేయ హీరోగా వచ్చిన ‘‘90ఎంల్’’ సినిమాలో చివరిసారిగా ‘‘నాతో నువ్వుంటే చాలు’’ అనే పాటను అద్నాన్ సమీ పాడారు. మెగాస్టార్ చిరంజీవి కోసం ఏ జిల్లా ఏ జిల్లా (శంకర్ దాదా ఎంబీబీఎస్), భూగోళమంత సంచిలోనా (శంకర్ దాదా జిందాబాద్) గీతాలను ఆయన ఆలపించారు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత చిరు సినిమా కోసం సమీ పని చేశారు. త్వరలోనే ఈ ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout