లెజెండ్ సినిమా సమర్పణలో విజయ్ ఆంటోనీ 'కాశి' 

  • IndiaGlitz, [Thursday,May 10 2018]

సెన్సిబుల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటూ.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం కాశి. విజయ్ ఆంటోనీ సరసన అంజలి, సునైన కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లెజండ్ సినిమా పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి తెలుగులో విడుదల చేయనున్నారు.

భారీ పోటీ నడుమ అత్యధిక మొత్తం చెల్లించి ఈ చిత్రాన్ని దక్కించుకొన్నారు. తమిళంలో మే 18న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది త్వరలో వెల్లడిస్తారు.

వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. కుదిరినంత తొందరలో తెలుగు వెర్షన్ ను కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి సన్నాహాలు చేస్తున్నారు.

విజయ్ ఆంటోనీ, అంజలి, సునైన, అమృత అయ్యర్, శిల్పా మంజునాథ్, రాకేష్ పృధ్వీ, గాల్విన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోనీ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్, ఎడిటర్: లారెన్స్ కిషోర్, నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి, రచన-దర్శకత్వం: కిరుతిగ ఉదయనిధి. 

More News

నిర్మాణానంతర‌ ప‌నుల్లో 'దేశంలో దొంగ‌లు ప‌డ్డారు'

ఖ‌యూమ్, త‌నిష్క్ రాజ‌న్, షానీ, పృథ్వీ రాజ్, స‌మీర్, లోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సారా క్రియేష‌న్స్  పై  గౌత‌మ్ రాజ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో

పోస్ట్ ప్రొడక్షన్ దశలో సాగరతీరంలో

లాస్య ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం పై వైజాగ్ సత్యానంద్ మాస్టర్ గారి శిష్యులైన దిశాంత్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్ గా సీనియర్ నటులు

రానాతో మాత్ర‌మే వెంట‌వెంట‌నే..

దర్శకుడిగా త‌న‌ తొలి సినిమా అయిన‌ ‘చిత్రం’తోనే ఘ‌న విజ‌యాన్ని అందుకున్నారు తేజ.

'టాక్సీవాలా' రాక అప్పుడేనా?

యూత్ స్టార్ విజయ్ దేవరకొండ, ప్రియాంక జవల్కర్ జంటగా నటించిన మూవీ ‘టాక్సీవాలా’.

పూరి మ‌న‌సు పెట్టి స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుంద‌నేది 'మెహ‌బూబా' సినిమా చూస్తే తెలుస్తుంది - దిల్‌రాజు

పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌ నిర్మించిన చిత్రం 'మెహబూబా'.