కంగనాకు షాక్.. లీగల్ నోటీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఫర్ బ్రాండ్ కంగనా రనౌత్.. ఈ పేరు చెబితే కాంట్రవర్సీ క్వీన్ అనే పేరే ముందుగా వినిపిస్తుంది. బాలీవుడ్‌లో చాలా మంది కంగనా రనౌత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారే. అయినా ఆమె ఏమీ పట్టించుకోదు. ఏకంగా శివసేన ప్రభుత్వంతోనే గొడవలు పెట్టుకుంది. ఇలాంటి తలనొప్పి అమ్మడుకే ఒకడు తలనొప్పి తెప్పించాడంటే... వాడెంతటి ఘనుడో అనుకోవాలి. ఓ వ్యక్తి ఏకంగా కంగనారనౌత్‌కు కోర్టు నోటీసలు పంపాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు.. అశిష్ కౌల్. ఈయన ఓ రైటర్. ఈయనకు, కంగనాకు ఏంటి గొడవ అని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. అశిష్ కౌల్ ‘దిద్దా.. కాశ్మీర్ కీ యోధా రాణి’ అనే పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకం ఇంగ్లీష్ వెర్షన్ విడుదలై నాలుగేళ్లు అవుతుంది. హిందీ సహా ఇతర భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
అయితే ఇప్పుడు తన అనుమతి లేకుండా ‘దిద్దా.. కాశ్మీర్ కీ యోధా రాణి’ సినిమాను చేయడమేంటి? అని అంటున్నాడు. అందుకు కారణం.. ‘దిద్దా.. కాశ్మీర్ కీ యోధా రాణి’కి సంబంధించి పూర్తి హక్కులు తన దగ్గరే ఉన్నాయని ఆశిష్ కౌల్ అంటున్నాడు. తన అనుమతి లేకుండా సినిమాను చేస్తామని చెప్పిన కంగనాకు ఆశిష్ కౌల్ లీగల్ నోటీసులను పంపాడు. మరి ఈ వ్యవహారంపై కంగనా రనౌత్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితగాథను మణికర్ణిక .. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది కంగనా రనౌత్. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా కాశ్మీర్ రాణి దిద్దా జీవితగాథను మణికర్ణిక ది లెజెండ్ ఆఫ్ దిద్దా పేరుతో తెరకెక్కించనున్నామని తెలిపింది.మరిప్పుడు ఈ హక్కుల గొడవ ఎంత వరకు వెళుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com