`క్వీన్`కు షాక్ తగలనుందా?
- IndiaGlitz, [Friday,September 13 2019]
తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసిన మహిళానేత విప్లవ నాయకురాలు జయలలిత బయోపిక్ సినిమాల రూపంలో, వెబ్ సిరీస్ రూపంలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల గౌతమ్ మీనన్, మరో దర్శకుడితో కలిసి వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు 'క్వీన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నటి రమ్యకృష్ణ జయలలిత పాత్రలో కనపడబోతున్నారు. ఎం.ఎక్స్ ప్లేయర్లో ఈ వెబ్ సిరీస్‌లో తొలి భాగం ప్రసారం కానుంది. కాగా ఇప్పుడు ఈ వెబ్‌సిరీస్‌కు షాక్ తగలనుంది. ఎందుకంటే జయలలిత మేనల్లుడు దీపక్ క్వీన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. తమ అనుమతి తీసుకోకుండా వెబ్‌సిరీస్ రూపంలో జయలలిత బయోపిక్‌ను రూపొందిస్తున్నారు కాబట్టి.. దర్శక నిర్మాతలపై చట్ట పరమైన చర్యలు తీసుకోబోతున్నాం అని దీపక్ తెలిపారు. మరి దీనిపై వెబ్ సిరీస్ దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
సినిమాల విషయానికి వస్తే కంగనా రనౌత్, ఎ.ఎల్.విజయ్ కాంబినేషన్లో 'తలవి' అనే బయోపిక్ రూపొందుతుంటే.. నిత్యామీనన్ అమ్మ పాత్రలో నటిస్తోన్న మరో బయోపిక్ ది ఐరన్ లేడీ కూడా చిత్రీకరణ దశలో ఉంది. ఈ రెండు చిత్రాలు కాకుండా మరో చిన్న సినిమా కూడా రూపొందుతుంది. ముగ్గురు స్టార్ కథానాయికలు నటిస్తోన్న అమ్మ బయోపిక్స్ అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి. మరి ఎవరు ఎలా ప్రేక్షకులను మెప్పిస్తారనే సంగతి చూడాలి.