హీరోతో పెళ్లి... అమెరికాలో ఉద్యోగానికి టాటాబైబై
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోతో పెళ్లి... అదీ మహేష్ బాబుకు 'ఒక్కడు', ప్రభాస్ కు 'వర్షం', తమిళ్ హీరో సిద్ధార్థ్ కు తెలుగులో ఇమేజ్ రావడానికి కారణమైన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన నిర్మాత ఎంఎస్ రాజు కుమారుడితో! అందుకని, అమెరికా నుండి ఓ అమ్మాయి హైదరాబాద్ వచ్చేస్తోంది. ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఇక్కడ సెటిల్ అవ్వాలని మరీ డిసైడ్ అయ్యింది. అసలు వివరాల్లోకి వెళితే...
ఫిబ్రవరి 13న ఎంఎస్ రాజు కుమారుడు, హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అతడికి కాబోయే శ్రీమతి పేరు దీపిక. ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ లో ఉద్యోగం చేస్తోంది. సుమంత్ అశ్విన్ తో పెళ్లి కుదరడంతో ఉద్యోగానికి అమ్మాయి రాజీనామా చేసి ఇండియా వస్తోంది. ఇకపై ఎంఎస్ రాజు ఫ్యామిలీకి దీపిక ఫ్యామిలీ చాలా రోజుల నుండి తెలుసు. అయితే, ఇది లవ్ మ్యారేజ్ కాదు. పెద్దలు కుదిర్చిన వివాహమే. హైదరాబాద్ కి 60 కిలోమీటర్ల దూరంలో ఫామ్ హౌస్ లో పెళ్లి జరగనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com