‘క్రాక్’ సినిమాకు లీగ‌ల్ స‌మ‌స్య‌..!

  • IndiaGlitz, [Monday,November 23 2020]

ర‌వితేజ, శృతిహాస‌న్ హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘క్రాక్’. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ కార్య‌క్ర‌మాల‌తో బిజీ బిజీగా ఉంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిర్మాత ఠాగూర్ మ‌ధు తెలిపారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఇప్పుడీ సినిమాకు లీగ‌ల్ స‌మ‌స్య ఎదురైంద‌ట‌. అస‌లు ‘క్రాక్’కి వ‌చ్చిన స‌మ‌స్యేంట‌నే వివ‌రాల్లోకెళ్తే..

ఠాగూర్ మ‌ధు గ‌తేడాది త‌మిళ చిత్రం ‘అయోగ్య‌న్‌’ను తెలుగులో ‘అయోగ్య’ పేరుతో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను 11 కోట్ల‌కు కొన్న నిర్మాత‌.. విడుద‌ల చేయ‌డానికి డిస్ట్రిబ్యూట‌ర్‌కు మ‌రో ఐదు కోట్ల రూపాయ‌ల‌ను నాన్ రిఫండ‌బుల్ అమౌంట్‌గా చెల్లించడానికి అగ్రిమెంట్ చేసి సినిమాను విడుద‌ల చేశారు. సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయ‌లు వ‌చ్చాయి. దాదాపు ఏడుకోట్ల రూపాయ‌లు న‌ష్టం వ‌చ్చింది. ఈ మొత్తాన్ని నిర్మాత ఠాగూర్ మ‌ధు ఇంకా చెల్లించ‌లేదు. దీంతో స‌ద‌రు డిస్ట్రిబ్యూట‌ర్ త‌న‌కు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేవర‌కు ‘క్రాక్’ సినిమాను విడుద‌ల చేయ‌కుండా కోర్టు స్టే తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడట‌. మ‌రీ స‌మ‌స్య‌ను ఠాగూర్ మ‌ధు ఎంత త్వ‌ర‌గా క్లియ‌ర్ చేసుకుంటే అంత మంచిద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

More News

బోర్ కొట్టించిన సండే.. లాస్య ఎలిమినేట్..

సండే.. ఫన్‌డే.. లాస్య ఎలిమినేషన్ తప్ప చెప్పుకోదగ్గ అంశాలేమీ లేవు. బోర్ కొట్టించే ఫన్ తప్ప..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించిన యాప్రాల్ ప్రజలు..

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రజాప్రతినిధులను కొన్ని ప్రాంతాల్లో ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు.

హైదరాబాద్‌లోనే పెద్ద సినీ పరిశ్రమ.. అండగా ఉంటాం: కేసీఆర్

తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని  చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

'ఆర్‌ఆర్‌ఆర్‌'లో షూట్‌లో జాయిన్‌ అయిన  హాలీవుడ్‌ స్టార్స్‌

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో

నాని ‘శ్యామ్ సింగరాయ్’ స్టోరీ ఇదేనట...

నేచురల్ స్టార్ నాని లాక్‌డౌన్ తర్వాత మరింత స్పీడ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుని షూటింగ్‌లు కానిచ్చేస్తున్నాడు.