‘క్రాక్’ సినిమాకు లీగల్ సమస్య..!
Send us your feedback to audioarticles@vaarta.com
రవితేజ, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘క్రాక్’. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత ఠాగూర్ మధు తెలిపారు. లేటెస్ట్ సమాచారం మేరకు ఇప్పుడీ సినిమాకు లీగల్ సమస్య ఎదురైందట. అసలు ‘క్రాక్’కి వచ్చిన సమస్యేంటనే వివరాల్లోకెళ్తే..
ఠాగూర్ మధు గతేడాది తమిళ చిత్రం ‘అయోగ్యన్’ను తెలుగులో ‘అయోగ్య’ పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను 11 కోట్లకు కొన్న నిర్మాత.. విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్‌కు మరో ఐదు కోట్ల రూపాయలను నాన్ రిఫండబుల్ అమౌంట్‌గా చెల్లించడానికి అగ్రిమెంట్ చేసి సినిమాను విడుదల చేశారు. సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చాయి. దాదాపు ఏడుకోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఈ మొత్తాన్ని నిర్మాత ఠాగూర్ మధు ఇంకా చెల్లించలేదు. దీంతో సదరు డిస్ట్రిబ్యూటర్ తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేవరకు ‘క్రాక్’ సినిమాను విడుదల చేయకుండా కోర్టు స్టే తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడట. మరీ సమస్యను ఠాగూర్ మధు ఎంత త్వరగా క్లియర్ చేసుకుంటే అంత మంచిదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout