close
Choose your channels

కిక్కెక్కిస్తున్న లే చలో

Friday, September 25, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'రామ్ చరణ్', సూపర్ డైరెక్టర్ 'శ్రీను వైట్ల' ల తో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం బ్రూస్‌లీ. ప్రస్తుతం హైదరాబాద్ లో నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ చిత్రంలోని 'లే చలో' సాంగ్ ఇప్పటికే కుర్రకారును కిర్రెక్కిస్తోంది. థమన్ బాణీల్లో రూపొందిన ఇతర పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించే స్థాయిలోనే సిద్ధమయ్యాయని వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన 'బ్రూస్ లీ' టీజర్స్, ఫస్ట్ లుక్స్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో కనిపించబోతున్నారనే వార్త అందరిలోనూ మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

త్వరలోనే మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. శరవేగంగా ఈ చిత్ర నిర్మాణం సాగుతోంది. ఓ వైపు చిత్రీకరణ సాగుతూ ఉండగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా పూర్తవుతోంది. అక్టోబర్ 2న 'బ్రూస్ లీ' ఆడియో విడుదల కానుంది. అదే నెల 16న 'బ్రూస్ లీ' ఎట్టిపరిస్థితుల్లోనూ జనం ముందు నిలవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

రామ్ చరణ్ కు జోడీగా ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన తీరు ట్రయిలర్స్ లోనే యువతకు హుషారు కలిగిస్తోంది. ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని నిర్మాత డి.వివి.దానయ్య, చిత్ర యూనిట్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment