డిజిటల్‌లో ‘లక్ష్మీబాంబ్’ డేట్ ఫిక్సయ్యిందా?
- IndiaGlitz, [Tuesday,June 16 2020]
కరోనా ఎఫెక్ట్‌తో సినిమా పరిశ్రమకు గడ్డుకాలం నడుస్తుందనే చెప్పాలి. థియేటర్స్ మూత పడటంతో సినిమాలు రిలీజ్‌లు ఆగిపోయాయి. రెండు నెలల తర్వాత చాలా పరిమితులు మధ్య షూటింగ్స్‌కు అనుమతులు దొరికాయి. అసలు కరోనా భయంతో సెట్స్‌కు వెళ్లడమనేది నిర్మాతలకు పెద్ద సంకటంగా మారింది. మరో పక్క ఆర్థిక ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. సినిమాను అనుకున్న టైమ్‌లో రిలీజ్ చేయకపోతే ఫైనాన్సియర్స్ నుండి వారికి సమస్యలు ఎదురవుతాయి. చాలా సినిమాలకు ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే సినిమాలు థియేటర్స్‌లో విడుదల కావడం అంత సులభంగా కనిపించడం లేదు. అసలు థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. ఒకవేళ కరోనా ఎఫెక్ట్ తగ్గినా ఒకేసారి సడలింపు ఉండదు. దశల వారిగానే సడలింపు ఉంటుంది. ఈ సడలింపుల్లో సినిమా థియేటర్స్, మాల్స్‌కు చివరి స్థానం ఉంటుందనడంలో సందేహం లేదు. దీంతో నిర్మాతలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఆదరణ పెరుగుతుంది. ఈ కరోనా టైమ్‌లో ఓటీటీలకు వ్యూవర్స్ పెరిగారు. దీంతో నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీ విడుదలలకు సిద్ధమయ్యాయి. సినీ వర్గాల సమాచారం మేరకు ..అక్షయ్ కుమార్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న హారర్ థ్రిల్లర్ కామెడీ చిత్రం లక్ష్మీబాంబ్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తారని, ఆ దిశగా నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని వార్తలు వినపడుతున్నాయి. లేటెస్ట్ సమాచారం మేరకు ఆగస్ట్ 15న లక్ష్మీబాంబ్‌ను ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ రానుంది.