లక్ష్మీ పార్వతి సినీ రంగ ప్రవేశం..కన్ఫర్మ్ చేసిన హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి సినీ రంగ ప్రవేశం చేయనున్నారు. ఈ విషయాన్ని హీరోయిన్ ముస్కాన్ కన్పర్మ్ చేసింది. బాలకృష్ణ హీరోగా నటించిన `పైసా వసూల్`లో హీరోయిన్గా నటించిన ముస్కాన్ ఇప్పుడు `రాగల 24 గంటల్లో` అనే థ్రిల్లర్‌లో నటించింది. `ఢమరుకం` శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో సినిమా రూపొందింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే మరో సినిమాలో ఈమె నటిస్తుంది. తెలంగాణ నేపథ్యంలో సాగే రస్టిక్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం `రాధాకృష్ణ`. ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో లక్ష్మీ పార్వతి కూడా నటిస్తున్నారని ఆమె తెలిపారు. లక్ష్మీ పార్వతితో కలిసి నటించడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించిందని ఆమె తెలిపారు.
సీనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఇప్పటి వరకు రాజకీయాలకే పరిమితమయ్యారు. రీసెంట్గా ఈమెను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ఛైర్మన్‌గా కూడా నియమించింది. ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్న లక్ష్మీ పార్వతి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున 2019 ఎన్నికల్లో ప్రచారం చేశారు. కాగా రాజకీయాలకే పరిమితమై పోకుండా ఈమె సినీ రంగ ప్రవేశం చేయనున్నారు. అయితే ఆమె పాత్ర ఎలా ఉంటుందనే దానిపై క్లారిటీ లేదు. త్వరలోనే లక్ష్మీ పార్వతి పాత్రపై ఓ క్లారిటీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com