'లక్ష్మీబాంబ్' టైటిల్ మార్పు
Send us your feedback to audioarticles@vaarta.com
నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన రాఘవ లారెన్స్ ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్‌గా మారాడు. తను నటిస్తూ దర్శకత్వం వహించిన `కాంచన` సినిమాని హిందీలో `లక్ష్మీబాంబ్`గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రం ఓటీటీలో నవంబర్ 9న ప్రసారం కానుంది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కియరా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కోసం బాలీవుడ్ వర్గాలు కాస్త ఆసక్తిగానే ఎదురుచూస్తుండగా మరోవైపు లారెన్స్ కూడా బాలీవుడ్‌లో సక్సెస్ కొట్టడానికి ఎగ్జయిట్‌మెంట్‌గా వెయిట్ చేస్తున్నాడు. అయితే మేకర్స్‌కు చివరి నిమిషంలో అనుకోని షాక్ తగిలింది.
అదేంటంటే సినిమా టైటిల్ 'లక్ష్మీబాంబ్' హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయంటూ శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన మేకర్స్‌కు లీగల్ నోటీసులు పంపింది. నోటీసులు ప్రకారం దర్శక నిర్మాతలు చివరి నిమిషంలో సినిమా టైటిల్‌ను లక్ష్మీ అని పెట్టారట. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రాన్స్‌జెండర్స్ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. మరి తెలుగు, తమిళంలో హిట్ అయిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే నవంబర్ 9 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments