విబేదాలు..లారెన్స్ వాకౌట్
Send us your feedback to audioarticles@vaarta.com
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో బాలీవుడ్ సినిమా 'లక్ష్మీబాంబ్'. తమిళంలో రూపొంది.. తెలుగులోకి అనువాదమై ఘన విజయం సాధించిన 'కాంచన' సినిమాకు ఇది రీమేక్. తెలుగు, తమిళంలో రాఘవ లారెన్స్ పోషించిన పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేశారు. అలా విడుదల చేశారో లేదో.. దర్శకుడు లారెన్స్ పెద్ద బాంబ్ పేల్చాడు. తాను ప్రాజెక్ట్ నుండి తప్పుకోబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు
"గౌరవం లేని ఇంట్లోకి అడుగు పెట్టకూడదనే సామెత ఉంది. కాబట్టి నేను దర్శకుడిగా సినిమా చేయడం లేదు. ఒక కారణమని చెప్పలేను. ఉదాహరణకు.. నా సినిమా ఫస్ట్ లుక్ విడులైందని ఎవరో చెబితే కానీ నాకు తెలియలేదు. దర్శకుడిగా ఫస్ట్ లుక్ గురించి నాతో డిస్కస్ చేయలేదు.
ఓ క్రియేటర్‌గా చెబుతున్నాను. ఫస్ట్ లుక్ బాగా లేదు. డిసప్పాయింట్ అయ్యాను. ఇలాంటి పరిస్థితి మరో దర్శకుడికి రాకూడదు. మరో దర్శకుడితో ఈ సినిమాను డైరెక్ట్ చేయించుకుంటే నాకు అభ్యంతరం లేదు. నేనుఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అగ్రిమెంట్ చేయలేదు.
స్క్రిప్ట్‌ను అక్షయ్ కుమార్‌గారికి ఇవ్వడానికి నేను సిద్ధం. ఆయనంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. అక్షయ్కుమార్గారిని కలవబోతున్నాను. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు. సినిమా పెద్ద సక్సెస్ సాధించాలి`` అన్నారు లారెన్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com