ర‌జ‌నీ మూవీని రీమేక్ చేస్తున్న లారెన్స్..!

  • IndiaGlitz, [Friday,November 04 2016]

కొరియోగ్రాఫ‌ర్ గా, హీరోగా, డైరెక్ట‌ర్ గా...ఇలా త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో విజ‌యం సాధించిన మ‌ల్టీ టాలెంటెడ్ ప‌ర్స‌న్ రాఘ‌వ లారెన్స్. కాంచ‌న‌, గంగ చిత్రాల‌తో హ‌ర్ర‌ర్ మూవీస్ లో ఓ సంచ‌ల‌నం సృష్టించిన లారెన్స్ ఇప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీ మూండ్రు ముగమ్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆధారంగానే మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మొన‌గాళ్లు సినిమా చేసారు.

చిరు ముగ్గురు మొన‌గాళ్లు సినిమా ఫ‌ర‌వాలేదు అనిపించినా ర‌జ‌నీ మూండ్రు ముగ‌మ్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు లారెన్స్ ఈ చిత్రాన్ని చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఈ విష‌యాన్ని లారెన్స్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ...ర‌జ‌నీ సార్ ఆశీస్సుల‌తో ఈ చిత్రాన్ని చేస్తున్నాను అంటూ ఓ ఫోటో కూడా పోస్ట్ చేసాడు. మ‌రి...ర‌జ‌నీ న‌టించిన చిత్రాన్ని లారెన్స్ ఎలా చేస్తాడో చూడాలి..!

More News

ప‌వ‌న్ హీరోయిన్ ని ట్రై చేస్తున్న నితిన్..!

యువ హీరో నితిన్ అ ఆ సినిమాతో భారీ విజ‌యాన్ని సాధించిన త‌ర్వాత నెక్ట్స్ మూవీ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. చాలా క‌థ‌లు విన్న‌ప్ప‌టికీ ఫైన‌ల్ గా అందాల రాక్ష‌సి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడితో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పాడు.

ఈరోజు థియేట‌ర్స్ లో న‌రుడా డోన‌రుడా..!

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ న‌టించిన తాజా చిత్రం న‌రుడా డోన‌రుడా. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్ తెర‌కెక్కించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ఆడియోన్స్ లో ఆస‌క్తిని పెంచింది.

దువ్వాడ‌ సెట్స్ లో జ‌గ‌న్నాథ‌మ్.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది.

బోయపాటి శ్రీను, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ప్రారంభం

బెల్లంకొండ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని సినిమా కార్యాలయంలో లాంచనంగా ప్రారంభమైంది.

అందుకనే...నరుడాడోనరుడా సక్సెస్ అవుతుంది - తనికెళ్ల భరణి..!

రచయితగా,నటుడుగా,దర్శకుడుగా...ఇలా తను ప్రవేశించిన ప్రతి శాఖలో విజయం సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ల భరణి.