రజనీ మూవీని రీమేక్ చేస్తున్న లారెన్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
కొరియోగ్రాఫర్ గా, హీరోగా, డైరెక్టర్ గా...ఇలా తను ప్రవేశించిన ప్రతి శాఖలో విజయం సాధించిన మల్టీ టాలెంటెడ్ పర్సన్ రాఘవ లారెన్స్. కాంచన, గంగ చిత్రాలతో హర్రర్ మూవీస్ లో ఓ సంచలనం సృష్టించిన లారెన్స్ ఇప్పుడు రజనీకాంత్ మూవీ మూండ్రు ముగమ్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆధారంగానే మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు సినిమా చేసారు.
చిరు ముగ్గురు మొనగాళ్లు సినిమా ఫరవాలేదు అనిపించినా రజనీ మూండ్రు ముగమ్ చిత్రం ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు లారెన్స్ ఈ చిత్రాన్ని చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ విషయాన్ని లారెన్స్ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ...రజనీ సార్ ఆశీస్సులతో ఈ చిత్రాన్ని చేస్తున్నాను అంటూ ఓ ఫోటో కూడా పోస్ట్ చేసాడు. మరి...రజనీ నటించిన చిత్రాన్ని లారెన్స్ ఎలా చేస్తాడో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com