మరోసారి లారెన్స్ దర్శకత్వంలో

  • IndiaGlitz, [Wednesday,August 05 2015]

కొరియోగ్రాఫర్ నుండి డైరెక్టర్ గా మారి మాస్, స్టైల్, డాన్, రెబల్, ముని సీక్వెల్స్' చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ప్రస్తుతం వేందర్ మూవీస్ బ్యానర్ లో మరో రెండు సినిమాలు చేయనున్నాడు. అందులో నాగ' అనే పేరుతో కింగ్ కోబ్రా కాన్సెప్ట్ పై ఓ చిత్రాన్ని రూపొందించనున్నాడట. ఈ చిత్రంలో హీరోగానే నటిస్తూనే, డైరెక్ట్ చేస్తున్నాడట లారెన్స్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రాఘవేంద్ర ప్రొడక్షన్స్, వేందర్ మూవీస్ ఈ చిత్రాలను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తాజా సమచారం ప్రకారం ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం హీరోయిన్ జ్యోతికను చిత్రయూనిట్ సంప్రదిస్తున్నారట. గతంలో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో మాస్' చిత్రంలో జ్యోతిక నాగార్జున సరసన నటించింది. 36 వయదినిలే' సినిమాతో సక్సెస్ ఫుల్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిచిన జ్యోతిక ఈ విషయంపై ఏమని సమాధానమిస్తుందో చూడాలి.