అమ్మ గొప్పతనం పై లారెన్స్ పాట
Send us your feedback to audioarticles@vaarta.com
సృష్టిలో తొలి దైవం అమ్మనే. అలాంటి తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని రాఘవ లారెన్స్ తెలిపారు. ఈ దర్శకుడు, నటుడు మదర్స్ డే సందర్భంగా అమ్మ గొప్పతనాన్ని చెప్పేలా ఓ పాటను రూపొందించి విడుదల చేశారు.
ఈ వేడుకలో లారెన్స్ తల్లి కన్మణి సహా పలువురు మాతృమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ "అన్నీ జీవులకు అమ్మే అద్భుత దైవం.
తన రక్తాన్ని పంచి, జన్మనిచ్చి, వారికి మాటలు నేర్పి ప్రయోజకులను చేసిన తల్లులను మనం కాపాడుకోవాలి. కానీ నేడు చాలా మంది తల్లిదండ్రులు రోడ్ల పై ఉండటం బాధాకరం. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం మన కర్తవ్యం" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com