Rudhrudu: రాఘవ లారెన్స్ కధానాయకుడిగా 'రుద్రుడు' గ్లింప్స్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ కధానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రుద్రుడు'. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. నిర్మాతలు సినిమా విడుదలకు సరైన స్లాట్‌ని ఎంచుకున్నారు. రుద్రుడు 2023లో ఏప్రిల్ 14న వేసవిలో థియేటర్స్ లో అలరించనుంది.
రాఘవ లారెన్స్ బర్త్ డే కానుకగా 'రుద్రుడు' భారీ యాక్షన్ గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్. లారెన్స్ కంప్లీట్ ట్రాన్స్ ఫార్మ్మేషన్ లో రగ్గడ్ లుక్ లో కనిపించారు. ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్స్ క్రియేటడ్ అనే ట్యాగ్ లైన్ సినిమాలో లారెన్స్ పాత్రని తెలియజేస్తింది. యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. జి.వి. ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం యాక్షన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. కెమరాపనితనం బ్రిలియంట్ గా వుంది. ఈ గ్లింప్స్ యాక్షన్ ని ఇష్టపడే వారిని ఆకట్టుకుంటుంది.
ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పిస్తున్నారు.
ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు.
రుద్రుడు ఏప్రిల్ 14, 2023న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.
తారాగణం: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com