జూనియర్ ఆర్టిస్ట్‌ను వేధించిన లారెన్స్ తమ్ముడు!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్ రాఘవ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన అనతి కాలంలోనే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఎక్కడికో ఎదిగిపోయాడు. అయితే.. ఆయన తమ్ముడు వినోద్ (ఎల్విన్) మాత్రం కొన్ని కొన్ని చిల్లర పనులు చేసి వార్తల్లో నిలుస్తున్నాడు!. వరంగల్‌కు చెందిన దివ్య అనే జూనియర్ ఆర్టిస్ట్.. ఎల్విన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను గత కొంతకాలంగా వేధిస్తున్నాడని.. లవ్ ప్రపోజ్‌ను తాను తిరస్కరించడంతో వేధిస్తున్నాడని ఫిర్యాదులో దివ్య పేర్కొంది. ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. విలేకరుల ముందు కంటతడి పెట్టుకుంది.
నన్ను జైలుకు పంపారు!
‘ఇన్ని రోజులు ఓపిక పట్టానని వినోద్ వేధింపులు మితిమీరిపోవడంతో తట్టుకోలేక హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి పోలీసులకు నేను ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేయాల్సిన పోలీసులు, సీఐ కుమ్మక్కై.. వారు నాపై తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు ఆ అధికారి ఏసీపీగా ఉన్నారు. ఏసీపీ కూడా లారెన్స్‌కు నమ్మినబంటులా మారిపోయారు. వీళ్లందరి చీకటి బాగోతాలు నాకు బాగా తెలుసు. పోలీసుల అండతో ఆఖరికి నన్ను జైలుకు కూడా పంపారు. కొన్ని రోజులుగా నన్ను కొందరు ఫాలో అవుతున్నారు. లారెన్స్ తమ్ముడితో నాకు ప్రాణ భయం ఉంది. వినోద్‌కు సంబంధించిన కొందరు ఫ్రెండ్స్ నన్ను చంపాలని అనుకుంటున్నారు. నన్ను కాపాడండి కేసీఆర్ గారూ’ అని దివ్య వేడుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout