జూనియర్ ఆర్టిస్ట్‌ను వేధించిన లారెన్స్ తమ్ముడు!

  • IndiaGlitz, [Friday,March 06 2020]

ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్ రాఘవ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన అనతి కాలంలోనే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఎక్కడికో ఎదిగిపోయాడు. అయితే.. ఆయన తమ్ముడు వినోద్ (ఎల్విన్) మాత్రం కొన్ని కొన్ని చిల్లర పనులు చేసి వార్తల్లో నిలుస్తున్నాడు!. వరంగల్‌కు చెందిన దివ్య అనే జూనియర్ ఆర్టిస్ట్.. ఎల్విన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను గత కొంతకాలంగా వేధిస్తున్నాడని.. లవ్ ప్రపోజ్‌ను తాను తిరస్కరించడంతో వేధిస్తున్నాడని ఫిర్యాదులో దివ్య పేర్కొంది. ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. విలేకరుల ముందు కంటతడి పెట్టుకుంది.

నన్ను జైలుకు పంపారు!

‘ఇన్ని రోజులు ఓపిక పట్టానని వినోద్ వేధింపులు మితిమీరిపోవడంతో తట్టుకోలేక హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి పోలీసులకు నేను ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేయాల్సిన పోలీసులు, సీఐ కుమ్మక్కై.. వారు నాపై తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు ఆ అధికారి ఏసీపీగా ఉన్నారు. ఏసీపీ కూడా లారెన్స్‌కు నమ్మినబంటులా మారిపోయారు. వీళ్లందరి చీకటి బాగోతాలు నాకు బాగా తెలుసు. పోలీసుల అండతో ఆఖరికి నన్ను జైలుకు కూడా పంపారు. కొన్ని రోజులుగా నన్ను కొందరు ఫాలో అవుతున్నారు. లారెన్స్ తమ్ముడితో నాకు ప్రాణ భయం ఉంది. వినోద్‌కు సంబంధించిన కొందరు ఫ్రెండ్స్ నన్ను చంపాలని అనుకుంటున్నారు. నన్ను కాపాడండి కేసీఆర్ గారూ’ అని దివ్య వేడుకుంది.

More News

‘ఎస్ బ్యాంక్’ ఖాతాదారులకు నిర్మలమ్మ అభయం!

ప్రముఖ ‘ఎస్ బ్యాంక్’ నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది.!. ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో  కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మాస్క్‌లు తయారీ కోసం ఉపాసన వీడియో చూడండి!

కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.

‘నిశ్శ‌బ్దం’ ట్రైల‌ర్‌ విడుద‌ల

`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు

'అర్జున' 13వ తేదీకి వాయిదా

డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన అర్జున చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 6న కాకుండా 13న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి వెల్లడించారు.

షూటింగ్ లో గాయపడ్డ అఖిల్

అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’.