వరుణ్ తో లావణ్య..

  • IndiaGlitz, [Saturday,February 27 2016]

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలు వంటి వరుస విజయాలు తర్వాత అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠికి టాలీవుడ్ అవకాశాలు తలుపు తడుతున్నాయి. తెలుగు, తమిళంలో సందీప్ కిషన్ హీరోగా సి.వి.కుమార్ దర్శకనిర్మాణంలో రూపొందనున్న చిత్రంలో అవకాశం దక్కించుకున్న లావణ్యత్రిపాఠి ఇప్పుడు ఏకంగా మెగా హీరో వరుణ్ తేజ్, శ్రీనువైట్ల చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం లావణ్యతో చర్చలు జరుగుతున్నాయని లావణ్య తన పాత్రపై చాలా సంతృప్తిగా ఉందని, అయితే ఇంకా ప్రాజెక్ట్ సైన్ చేయలేదని అందుకు కారణం డేట్స్ వగైరాలను పరీశీలించాల్సి ఉందని విశ్వసనీయవర్గాల సమచారం.