బాలీవుడ్‌వైపు అడుగులు...

  • IndiaGlitz, [Thursday,July 19 2018]

అందాల రాక్ష‌సితో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన లావ‌ణ్య త్రిపాఠి త‌ర్వాత చాలా తెలుగు సినిమాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం తెలుగులో రెండు సినిమాల్లో న‌టిస్తుంది. అందులో ఒక‌టి వ‌రుణ్ తేజ్‌, సంక‌ల్ప్ రెడ్డి చిత్రం కాగా.. మరో చిత్రం నిఖిల్ ముద్ర‌. అయితే బాలీవుడ్‌లో న‌టించాల‌ని లావ‌ణ్య చాలా రోజులుగా ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ట‌. ఎట్ట‌కేల‌కు ఆమె ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయ‌ని.. ఓ పెద్ద ప్రాజెక్ట్‌లో లావ‌ణ్య న‌టించ‌నుంద‌ని వార్తలు విన‌ప‌డుతున్నాయి. మ‌రి లావ‌ణ్య దీనిపై స్వయంగా ఏమ‌ని స్పందిస్తుందో చూడాలి.