కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్ పి.సి. 524’ గ్లింప్స్ విడుదల చేసిన లావణ్యా త్రిపాఠి
Send us your feedback to audioarticles@vaarta.com
కథానాయకుడిగా పరిచయమైన ‘రాజావారు రాణివారు’తో ప్రేక్షకులతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలను ఆకట్టుకున్న యువకుడు కిరణ్ అబ్బవరం. పల్లె వాతావరణానికి, స్వచ్ఛమైన ప్రేమకథకు పెద్దపీట వేసిన చిత్రమది. కథానాయకుడిగా రెండో చిత్రం ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ పాటలతో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతడు నటిస్తున్న మూడో చిత్రం ‘సెబాస్టియన్ పి.సి. 524’. కొత్త తరహా కథలతో రూపొందుతోన్న వినూత్న చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు విజయాలు కట్టబెడుతున్నారు. ఆ కోవలోకి చెందిన చిత్రమిది. ఈ సినిమా గ్లింప్స్‌ను శుక్రవారం సాయంత్రం ప్రముఖ కథానాయిక లావణ్యా త్రిపాఠి విడుదల చేశారు.
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా, టైటిల్ రోల్‌లో నటిస్తున్న సినిమా ‘సెబాస్టియన్ పి.సి. 524’. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. నైట్ బ్లైండ్‌నెస్ (రేచీకటి) నేపథ్యంలోని కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. క్రిస్మస్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా కథానాయిక లావణ్యా త్రిపాఠి ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేశారు. గేటు దగ్గర్నుంచి వెళుతూ చర్చిని, తర్వాత జీసస్‌ను చూపించి, ఆ తర్వాత హీరో కిరణ్ అబ్బవరాన్ని చూపించడం, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గ్లింప్స్‌లో ‘ఓ తల్లికి న్యాయం జరగడం కోసం మరో తల్లి చేసిన ప్రామిస్’, ‘నిజం ఎప్పటికీ దాగదు’ వంటి కోట్స్ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉన్నాయి.
జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 'సాహో' తర్వాత ఆయన సంగీతం అందిస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. సినిమా కథతో పాటు కొత్తగా ఏదైనా చేయాలని యూనిట్ సభ్యుల తాపత్రయం ఆయనకు నచ్చడంతో ఈ సినిమా అంగీకరించారు.
‘సెబాస్టియన్ పి.సి. 524’లో కిరణ్ అబ్బవరం రెండు లుక్స్‌లో కనిపించనున్నారని గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. మొదట గడ్డంతో కనిపించిన అతను, ఆ తర్వాత పోలీస్ డ్రస్‌లో క్లీన్ షేవ్‌తో కనిపించారు. సినిమాలో క్రిస్మస్ రోజున జన్మించిన క్రిస్టియన్ యువకుడు సెబాస్టియన్‌గా కిరణ్ అబ్బవరం కనిపించనున్నారు. అందుకని, గ్లింప్స్ చివర ‘హ్యాపీ బర్త్‌డే సెబా’ అని పేర్కొన్నారు.
కిరణ్ అబ్బవరం సరసన నమ్రతా దారేకర్, కోమలీ ప్రసాద్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ పార్ట్‌నర్: టికెట్ ఫ్యాక్టరీ, పబ్లిసిటీ & మార్కెటింగ్: చవన్ ప్రసాద్, డీఐ: సురేష్ రవి, సౌండ్: సింక్ సినిమాస్ సచిన్ సుధాకరన్, ఛాయాగ్రహణం: రాజ్ కె. నల్లి, కళ: కిరణ్ మామిడి, కూర్పు: విప్లవ్ న్యసదాం, సంగీతం: జిబ్రాన్, నిర్మాణ సంస్థ: ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్, సహ నిర్మాత: సిద్దారెడ్డి బి, నిర్మాతలు: ప్రమోద్, రాజు, కథ, దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout