ప్రకృతి ఒడిలో లావణ్య త్రిపాఠి కేఫ్ నిర్మాణం. ఆమె ప్లాన్ ఏంటంటే!
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. అందాల రాక్షసి, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి చిత్రాల్లో లావణ్య నటించింది. లావణ్య త్రిపాఠి ప్రకృతి ప్రేమికురాలు. తరచుగా లావణ్య త్రిపాఠి నేచర్ ని ఆస్వాదించేందుకు వివిధ ప్రదేశాలకు వెళుతూ ఉంటుంది.
ఇదిలా ఉండగా ఓ అందమైన ప్రాంతంలో కేఫ్ తరహాలో ఓ ఇంటిని నిర్మించాలనుకుంటోంది లావణ్య. ఆ వివరాలని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అందమైన ముస్సోరికి దగ్గర్లో కొండల ప్రాంతంలో ఉండే చమసారి అనే గ్రామంలో లావణ్య వ్యవసాయ ల్యాండ్ ని కొనుగోలు చేసిందట.
ఆ ల్యాండ్ లో కేఫ్ ని తలపించే విధంగా ఓ నిర్మాణం చేప్పట్టనున్నట్లు తెలిపింది. అయితే అది కమర్షియల్ పర్పస్ కోసం కాదు. తన ఫ్యామిలీ, సన్నిహితులు, స్నేహితుల కోసం. తన ఫ్యామిలీతో కలసి అక్కడికి వెళ్ళినప్పుడు సరదాగా గడిపేందుకు కేఫ్ లాంటి నిర్మాణం అయితే బావుంటుంది అని లావణ్య భావిస్తోంది.
తనకన్నా మొదట ఈ ఆలోచన లావణ్య తండ్రికి వచ్చిందట. కానీ అప్పట్లో అక్కడి పరిస్థితుల దృష్ట్యా నిర్మాణం చేయలేదు. కానీ ఇప్పుడు అక్కడ కేఫ్ నిర్మాణానికి తన కుటుంబ సభ్యులు ఓకె చెప్పినట్లు లావణ్య తెలిపింది. ఒక రిసార్ట్ లాగా ఎకో ఫ్రెండ్లిగా ఆ నిర్మాణం ఉంటుంది అని లావణ్య చెబుతోంది. లావణ్య త్రిపాఠి చివరగా 'చావు కబురు చల్లగా' చిత్రంలో నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com