ప్రకృతి ఒడిలో లావణ్య త్రిపాఠి కేఫ్ నిర్మాణం. ఆమె ప్లాన్ ఏంటంటే!

  • IndiaGlitz, [Saturday,June 26 2021]

అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. అందాల రాక్షసి, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి చిత్రాల్లో లావణ్య నటించింది. లావణ్య త్రిపాఠి ప్రకృతి ప్రేమికురాలు. తరచుగా లావణ్య త్రిపాఠి నేచర్ ని ఆస్వాదించేందుకు వివిధ ప్రదేశాలకు వెళుతూ ఉంటుంది.

ఇదిలా ఉండగా ఓ అందమైన ప్రాంతంలో కేఫ్ తరహాలో ఓ ఇంటిని నిర్మించాలనుకుంటోంది లావణ్య. ఆ వివరాలని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అందమైన ముస్సోరికి దగ్గర్లో కొండల ప్రాంతంలో ఉండే చమసారి అనే గ్రామంలో లావణ్య వ్యవసాయ ల్యాండ్ ని కొనుగోలు చేసిందట.

ఆ ల్యాండ్ లో కేఫ్ ని తలపించే విధంగా ఓ నిర్మాణం చేప్పట్టనున్నట్లు తెలిపింది. అయితే అది కమర్షియల్ పర్పస్ కోసం కాదు. తన ఫ్యామిలీ, సన్నిహితులు, స్నేహితుల కోసం. తన ఫ్యామిలీతో కలసి అక్కడికి వెళ్ళినప్పుడు సరదాగా గడిపేందుకు కేఫ్ లాంటి నిర్మాణం అయితే బావుంటుంది అని లావణ్య భావిస్తోంది.

తనకన్నా మొదట ఈ ఆలోచన లావణ్య తండ్రికి వచ్చిందట. కానీ అప్పట్లో అక్కడి పరిస్థితుల దృష్ట్యా నిర్మాణం చేయలేదు. కానీ ఇప్పుడు అక్కడ కేఫ్ నిర్మాణానికి తన కుటుంబ సభ్యులు ఓకె చెప్పినట్లు లావణ్య తెలిపింది. ఒక రిసార్ట్ లాగా ఎకో ఫ్రెండ్లిగా ఆ నిర్మాణం ఉంటుంది అని లావణ్య చెబుతోంది. లావణ్య త్రిపాఠి చివరగా 'చావు కబురు చల్లగా' చిత్రంలో నటించింది.

More News

ఓ డైరెక్టర్ నా క్లీవేజ్ చూడాలన్నాడు.. మరొకడు ఏకంగా..

బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకున్న సుర్వీన్ చావ్లా ఆ తర్వాత వెండితెరపై కూడా మెరిసింది.

ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు!

ప్రముఖ ఫిలిం క్రిటిక్, నటుడు కత్తి మహేష్ ప్రమాదానికి గురయ్యారు.

డైరెక్ట్ ఓటిటి రిలీజ్.. హాట్ స్టార్ తో నితిన్ ఫ్యాన్సీ డీల్ ?

యూత్ స్టార్ నితిన్ నుంచి ఈ ఏడాది ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి.

ఒక్క మామిడి కాయ ధర రూ.21 వేలు.. 9 శునకాలు, 3 గార్డ్స్ తో తోటకు కాపలా!

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. మధ్యప్రదేశ్, జబల్పూర్ కి చెందిన సంకల్ప్ సింగ్ పరిహర్ అనే రైతు తన మామిడి తోటకు 9 జర్మన్ షిపార్డ్ కుక్కలు,

రామ్ సినిమాకి ట్రబుల్.. దర్శకుడిపై ఫిర్యాదు, ఏం జరిగిందంటే..

తమిళ క్రేజీ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో నటించేందుకు హీరో రామ్ పోతినేని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.