లావణ్యకి రాసిపెట్టుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
'భలే భలే మగాడివోయ్'తో సాలిడ్ హిట్‌ని కొట్టింది 'అందాల రాక్షసి' లావణ్య త్రిపాఠి. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మూడేళ్ల తరువాత ఆ అమ్మడికి లభించిన విజయమిది. 'భలే భలే..' తరువాత లావణ్యకి ఫాలోయింగ్ పెరిగింది కూడా. ఈ నేపథ్యంలో ఆమె కొత్త చిత్రాలపై అందరి దృష్టి పడింది. దానికి తగ్గట్టే.. డిసెంబర్లో రెండు సినిమాలతో సందడి చేసే దిశగా లావణ్య ఉంది.
నాగార్జున సరసన నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా'.. తన తొలి చిత్ర కథానాయకుడు నవీన్ చంద్రతో నటించిన 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' చిత్రాలతో వచ్చే నెలలో లావణ్య పలకరించనుంది. ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తే గనుక.. లావణ్యకి ఒకే ఏడాదిలో హ్యాట్రిక్ రాసిపెట్టినట్టే. చూద్దాం.. ఏం జరుగుతుందో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com