నా రియల్ లైఫ్ లో ఆ...ఇద్దరి ఆలోచనలు కలిసున్న వ్యక్తినే కోరుకుంటా - హీరోయిన్ లావణ్య త్రిపాఠి
- IndiaGlitz, [Thursday,January 07 2016]
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై...తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నకథానాయిక లావణ్య త్రిపాఠి. ఆతర్వాత దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, లచ్చిందేవికి ఓ లెక్కుంది చిత్రాల్లో నటించిన లావణ్య..టాలీవుడ్ కింగ్ నాగార్జున సరసన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నటించింది. సంక్రాంతి కానుకగా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా సోగ్గాడే చిన్ని నాయనా సినిమా గురించి కథానాయిక లావణ్య త్రిపాఠి ఇంటర్ వ్యూ మీకోసం...
సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
నా క్యారెక్టర్ పేరు సీత. నా క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయి. రెగ్యులర్ సినిమాలో ఉండే హీరోయిన్ క్యారెక్టర్ లా ఉండదు. సినిమా అంతా చీరలోనే కనిపిస్తాను. నా గత చిత్రాలతో పోలిస్తే చాలా కొత్తగా ఉంటుంది.
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునతో వర్క్ చేయడం ఎలా ఉంది..?
నా ఫేవరేట్ హీరో నాగార్జున గారితో వర్క్ చేయడం ఎప్పటికీ మరిచిపోలేని మధురానుభూతి. ఆయనతో వర్క్ చేయడం ఓ ఛాలెంజ్ లా తీసుకున్నాను. స్టార్ హీరో అయినప్పటికీ నాగ్ సార్ సెట్స్ లో చాలా నార్మల్ గా ఉండేవారు. నన్ను ఎంతగానో ప్రొత్సహిస్తూ...నేను కంఫర్ట్ గా ఫీలయ్యేలా చేసారు.
మీ ఫేవరెట్ హీరో నాగార్జున అంటున్నారు కదా...ఏ సినిమా చూసి నాగ్ ఫ్యాన్ అయ్యారు..?
క్రిమినల్ సినిమా చూసినప్పటి నుంచి నాగార్జున గారికి ఫ్యాన్ అయిపోయాను. ఆ సినిమా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో తెలుసా...మనసా...సాంగ్ అంటే ఎంతో ఇష్టం. క్రిమినల్ సినిమాలో నటించిన నాగార్జున సార్, రమ్యక్రిష్ణలతో ఒకేసారి సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నటించడం చాలా హ్యాఫీగా ఫీలవుతున్నాను.
ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేసారు కదా...నాగార్జున రెండు పాత్రలు ఎలా ఉంటాయి...?
నాగ్ సార్...బంగార్రాజు, రామ్ అనే రెండు డిఫరెంట్ రోల్స్ చేసారు. బంగార్రాజు ఎక్కువుగా మాట్లాడుతుంటాడు. అమ్మాయిలతో అయితే మరీ ఎక్కువుగా మాట్లాడుతుంటాడు. అదే రామ్ విషయానికి వస్తే...బంగార్రాజు క్యారెక్టర్ కి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అమ్మాయిలతోనే కాదు...పెళ్లాంతో కూడా ప్రేమను వ్యక్తం చేయలేనంత సిగ్గు. ఈ రెండు క్యారెక్టర్స్ చాలా ఎంటర్ టైనింగ్ ఉంటాయి.
సిగ్గుపడే రామ్ లాంటి క్యారెక్టర్ మీ రియల్ లైఫ్ లో ఎవరినైనా చూసారా..?
అమ్మాయిలతో మాట్లాడాలంటే సిగ్గుపడే అబ్బాయిలను చూసాను.
ఇంతకీ...మీరు ఎలాంటి వ్యక్తిని ఇష్టపడతారు..బంగార్రాజా...? రామా..?
నాకు బంగార్రాజు, రామ్...ఇద్దరి ఆలోచనలు కలిసున్న వ్యక్తి భర్తగా రావాలనుకుంటాను. నాతో నిజాయితీగా ఉండాలి.
సీనియర్ హీరోయిన్ రమ్యక్రిష్ణ గారితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది..?
రమ్యక్రిష్ణ గారితో వర్క్ చేయడం ఎప్పటికీ మరచిపోలేను. ఎప్పుడూ ప్రొత్సహిస్తుండేవారు. తనో సీనియర్ ఆర్టిస్ట్ అనే ఫీలింగ్ ఎప్పుడు కలిగించకుండా..చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇద్దరు ఫ్రెండ్స్ కలసి వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది.
డైరెక్టర్ కళ్యాణ్ క్రిష్ణ కథ చెప్పినప్పడు ఏమనిపించింది..? సెట్స్ లో ఆయన వర్కింగ్ స్టైల్ గురించి..?
కళ్యాణ్ క్రిష్ణ కథ చెప్పినప్పుడు నా క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉండడంతో చాలా ఎక్సైయిట్ అయ్యాను. సెట్స్ లో ఆయన చాలా కాన్పిడెంట్ గా ఉండేవారు. ఆయనకు ఏ సీన్ లో ఆర్టిస్ట్ ల నుంచి ఎలాంటి నటనను రాబట్టాలో పూర్తిగా క్లారిటీ ఉంది. ఒక కొత్త దర్శకుడిలా కాకుండా ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లా ఈ సినిమా తీసారు.
మీరు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు కారణం ఏమిటి..?
అందాల రాక్షసి తర్వాత నుంచి నాకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే సినిమా సక్సెస్ అయితే హీరో, హీరోయిన్ కి మంచి పేరు వస్తుంది. అదే సినిమా ప్లాప్ అయితే ఆ సినిమా హీరోయిన్ ఐరెన్ లెగ్ అంటారు. వరుసగా ఒక హీరోయిన్ నటించిన సినిమాలన్నీ సక్సెస్ అయితే గోల్డెన్ లెగ్ అంటారు. మహేష్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్...ఇలా స్టార్స్ సినిమాలంటే వెంటనే ఓకె చెప్పచ్చు. స్టార్స్ లేని సినిమాలు అంటే కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాను. నాకు ఐరెన్ లెగ్ అనిపించుకోవడం ఇష్టం లేదు అందుకనే సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాను.
నాగార్జున సినిమా అని సోగ్గాడే చిన్ని నాయనా...లో నటించేందుకు అంగీకరించారా..? లేక కథ నచ్చి ఓకె చేసారా..?
నాగార్జున సార్ తో సినిమా అనగానే వెంటనే ఓకె చెప్పేసాను. ఆతర్వాత కథ విన్న తర్వాత ఓ మంచి సినిమా చేస్తున్నాను అనే ఫీలింగ్ కలిగింది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి...?
అల్లు శిరీష్ తో సినిమా చేస్తున్నాను. ఇందులో కాలేజ్ గాళ్ గా నటిస్తున్నాను. ఈ సినిమా తర్వాత నూతన దర్శకుడు శశి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాను. ఇది ఓ డిఫరెంట్ రోడ్ మూవీ. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.